BigTV English

Two Died in Boiler explosion: ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Two Died in Boiler explosion: ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Two Died in Boiler explosion in NTR District: ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇందుకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా నివాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు.


క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంఓ అధికారులతో మాట్లాడి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని.. అదేవిధంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడడంతోపాటు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు.

Also Read: పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీవే: చలసాని శ్రీనివాస్


ఈ ఘటనలో ఇద్దరు మృతి

ఎన్టీఆర్ జిల్లా బోదవాడలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో బాయిలర్ పేలి 16 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని విజయవాడలోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మృతిచెందినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ సృజన పరామర్శించారు. మరో ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం.

Tags

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×