BigTV English

Mars Favourite Zodiac Signs: అంగారకుడికి ఇష్టమైన రాశులు ఇవే..

Mars Favourite Zodiac Signs: అంగారకుడికి ఇష్టమైన రాశులు ఇవే..

Mars Favourite Zodiac Signs: అంగారకుడిని నవ గ్రహాలకు సైన్యాధ్యక్షుడిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి వివరించారు. రాశి ప్రతి వ్యక్తి మొత్తం జీవితాన్ని వివరించగలుగుతుంది. ప్రతి రాశికి పాలించే గ్రహం ఉంటుంది. ఆ రాశిలోకి గ్రహ గుణాలు వస్తాయి. అగ్ని మూలకంతో సంబంధం ఉన్న కుజుడికి ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. అవేంటి.. వాటి ప్రతి ఫలాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అంగారకుడి స్వభావం:
అంగారకుడికి ఇష్టమైన రోజు మంగళవారం. అంగారకుడు మానవుడి జీవితం మీద తప్పనిసరిగా ప్రభావం చూపిస్తాడు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, శౌర్యం, పరాక్రమం వంటివి కూడా ప్రసాదిస్తాడు. అంగారకుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది. అదే అశుభ స్థానంలో ఉంటే కొందరికి వివాహాన్ని ఆలస్యం చేస్తాడు.


కుజదోషాన్ని మంగళ దోషమని కూడా అంటారు. ఈ దోషం ఉంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతుంటారు. అదే శుభ స్థానంలో అంగారకుడు ఉంటే మాత్రం ఆరోగ్యంగా ఉంటారు. దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. అంగారకుడి అనుగ్రహంతో శక్తి, పరాక్రమాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అంగారక గ్రహానికి ఇష్టమైన రాశిచక్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు రాశులకు అంగారకుడు అధిపతి:
అంగారకుడిలో అగ్ని, నీరు అనే రెండు అంశాలు ఉన్నాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మేష, వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. అంగారకుడి మేషరాశిలో ఉన్నప్పుడు అగ్ని గుణాలను ఇస్తాడు. ఈ రెండు రాశులలో మేషరాశి అంగారకుడుకి ఎక్కువ ఇష్టమైనదని చెబుతుంటారు. అంగారకుడి గుణాలు చాలా వరకు మేషరాశిలో ఉంటాయి. అందుకే మేషరాశి వారు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినా భయపడకుండా ధైర్యంగా వా ఎదుర్కుంటారు. అంతేకాకుండా వీరికి బలం కూడా ఇదే.
అంగారక గ్రహానికి ఇష్టమైన రాశిచక్రాలు:
మేష రాశి:
నవ గ్రహాల్లో కుజుడితో పాటు సూర్యుడికి ఇష్టమైన రాశిచక్రాలో ఒకటి మేష రాశి. ఈ రాశి వారికి శక్తి , దైర్యం నూతనత్వం, ఉల్లాసం మొదలైన లక్షణాలు ఉంటాయి. ఈ రాశిపై కుజుడు నేరుగా మెదడుపై ప్రభావం చూపిస్తాడు. ఈ రాశిచక్రం అతి పెద్ద బలహీనత వీరి మనస్సు. వీరి మనస్సు సుస్థిరంగా ఉంటుంది. చంచలమైన మనస్సు కారణంగా వీరు ఒక చోట నిలవలేరు. జీవితంలో సానుకూల ఫలితాలు పొందడానికి ఇదే కారణం.

Also Read: శష రాజయోగ ప్రభావం.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు !


వృశ్చికరాశి :
వృశ్చికరాశి అంగారకుడికి ఇష్టమైన రాశుల్లో మరొకటి. వృశ్చిక, మేష రాశి వారు చాలా ఎనర్జెటిక్‌గా ఉంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా వీరు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.ఈ రాశుల వ్యక్తులు చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. సమస్యలను ఈజీగా పరిష్కరిస్తారు. వ్యాపారం వీరికి కలసివస్తుంది. ఉద్యోగ పరంగా ఉన్నత స్థానంలో ఉంటారు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×