BigTV English

Kangana Fires on Ambani’s Pre Wedding: అంబానీ పార్టీపై కంగనా ఫైర్‌.. డబ్బుకోసం నేను ఇలా చేయనంటూ..

Kangana Fires on Ambani’s Pre Wedding: అంబానీ పార్టీపై కంగనా ఫైర్‌.. డబ్బుకోసం నేను ఇలా చేయనంటూ..

Kangana fire on Ambani's party, saying it is necessary


Kangana Fire on Ambani’s Pre Wedding Party in Jamnagar: ఆసియాలోనే అత్యంత కుబేరుడైన ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్ కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. దీనికి ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరయ్యారు. ఇక ఈ పార్టీకి హాజరుకానీ సినీతారలు సైతం చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ తార కంగనా రనౌత్. తాజాగా కంగనా మాట్లాడుతూ..అంబానీ పార్టీకి హాజరైన సెలబ్రిటీలపై తనదైన శైలిలో విరుచుకుపడింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ వివాదాల క్వీన్ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాను ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో నిలుస్తుంటుంది. అంతేకాదు..ఈ మధ్య మరింతగా రెచ్చిపోయింది ఈ భామ. తాజాగా కంగనా ఓ పోస్ట్‌ను షేర్ చేస్తూ..ఇలా రాసుకొచ్చింది. నేను చాలా దారుణమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొన్నాను. అయితే లతాజీ నేను ఇద్దరు మాత్రమే పాటలు భారీ హిట్‌ని సాధించాయి. అందులో (ఫ్యాషన్ కా జల్వా, ఘనీ బావోలీ హోగయీ, లండన్ తుమ్‌కడ, సాదీగాలి, విజయీభవ).


Read More: ఇటలీ బీచ్‌లో నటితో డార్లింగ్ ప్రభాస్ రొమాన్స్‌

ఇక ఈ వేడుకల ద్వారా ప్రముఖ ప్రపంచ పాప్ సింగర్ రిహన్న భారత్‌లో తన ఫస్ట్ లైవ్ షోని ప్రదర్శించింది. మూడురోజుల పాటు, బాలీవుడ్ తారలు వారి అద్భుతమైన ప్రదర్శనలతో ఈ వేడుకలు తమ జీవితంలో ఎప్పటికి మధురజ్ఞాపకాలుగా గుర్తుండిపోయేలా చేసారు. ఇదే అంశంపై కంగనా మాట్లాడుతూ..నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా..నేను ఎప్పుడూ పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయలేదు. నాకు చాలా సూపర్‌ హిట్ ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు నేను అవార్డు షోలకు కూడా దూరంగా ఉన్నాను. పాపులారిటీ, డబ్బుకు నో చెప్పడానికి బలమైన క్యారెక్టర్, గౌరవంగా ఉండటం చాలా అవసరమని హాట్ కామెంట్స్ చేసింది. షార్ట్ కట్స్ ప్రపంచంలో నిజాయితీతో కూడిన డబ్బు మాత్రమే సంపాదించగలదని యువతరం అర్థం చేసుకోవాలని కోరింది నటి కంగనా.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 2024లో జరుగుతుండగా.. అంతకు ముందు ముఖేష్ అంబానీ దేశ, విదేశాల ప్రముఖుల కోసం ప్రీ-వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో బాలీవుడ్ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు ఇతర అతిథులు అమూల్యమైన సమయాన్ని గడిపారు. సినీ ప్రముఖుల్లో బిగ్‌బీ అమితాబ్, రజనీకాంత్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్, వరుణ్‌ధావన్, అనిల్ కపూర్, విక్కీ కౌశల్, రాణిముఖర్జీ, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మరి కంగనా రనౌత్ అలా మాట్లాడటం ఏంటని ఈ ఈవెంట్‌కి హాజరైన పలువురు తారల అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×