BigTV English

Prabhas Romance: ఇటలీ బీచ్‌లో నటితో డార్లింగ్ ప్రభాస్ రొమాన్స్‌

Prabhas Romance: ఇటలీ బీచ్‌లో నటితో డార్లింగ్ ప్రభాస్ రొమాన్స్‌
Darling Prabhas romance with actress on Italian beach
 

Darling Prabhas Romance with Actress on Italy Beach: పాన్‌ ఇండియా స్టార్‌, టాలీవుడ్ హీరో డార్లింగ్ ప్రభాస్ నటితో ఇటలీ బీచ్‌లో రొమాన్స్‌ చేస్తున్నాడు. అదేంటి అని ఆశ్చర్యపోకండి. నిజమండి బాబూ.. డార్లింగ్ ప్రభాస్ మూవీ అయినటువంటి కల్కి మూవీకి సంబంధించిన ఓ పాటకి సంబంధించిన షూట్‌ ఇటలీ బీచ్‌లో జరగబోతోంది. ఇందులో హీరో ప్రభాస్, నటి దిశాపటానీలపై ఓ రొమాన్స్‌ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు మూవీ మేకర్స్. అద్భుతమైన లొకేషన్‌లలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా మూవీ.. కల్కి 2898 ఏడీ. ఈ మూవీకి సంబంధించిన ఓ కీలక అప్డేట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మే 9న రిలీజ్ కానున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణెతో పాటు నటి దిశాపటానీ యాక్ట్ చేస్తోంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు నటుడు కమల్‌హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖ స్టార్ నటులు ఈ మూవీలో కీలక రోల్స్ పోషిస్తున్నారు. వైజయంతి బ్యానర్‌పై వస్తున్న ఈ మూవీని డైరెక్టర్ నాగ్‌ అశ్విన్ రూపొందిస్తున్నాడు.

Read More: వరల్డ్‌వైడ్‌ టాప్ 50 సినిమా దర్శకుల లిస్ట్‌లో ఉపేంద్రకు చోటు


అయితే మూవీ షెడ్యూల్‌లో భాగంగా ఇటలీ దేశంలోని బీచ్‌లో ప్రభాస్, దిశాపటానీల మధ్య రొమాంటిక్‌ సాంగ్‌ని మూవీ మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. అందుకు సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మూవీకి అనుకున్న సమయంలోపు రిలీజ్ చేయాలన్న పక్కా ప్లాన్‌తోనే డైరెక్టర్ నాగ్‌ అశ్విన్ శరవేగంగా వర్క్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మూవీ పనులు జరుగుతున్నట్లు సమాచారం.

ఇక ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే… ఈ మూవీ స్టోరీ కంప్లీట్‌గా మహాభారతం నాటి కాలం నుంచి స్టార్ట్ అయి 2898 శతాబ్దంతో పూర్తవుతుందని డైరెక్టర్ నాగ్‌ అశ్విన్ గతంలోనే పలు ఇంటర్వ్యూలలో మూవీ విషయాలను వెల్లడించారు. అందుకే ఈ చిత్రానికి కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఆడియెన్స్‌ని అలరించేందుకు మే 9న వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ ఖాతాను తెరిస్తే ప్రభాస్ మళ్లీ గాడీలో పడ్డట్లు అవుతుందని సినీ పెద్దలు చెబుతున్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×