E-Paper
Advertisement

kanguva: కంగువా రిలీజ్ డేట్‌పై నిర్మాత ఫుల్ క్లారిటీ..!

kanguva: కంగువా రిలీజ్ డేట్‌పై నిర్మాత ఫుల్ క్లారిటీ..!
Advertisement

kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయనకు టాలీవుడ్‌లోనూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. థియేటర్ల వద్ద హంగామా మామూలుగా ఉండదు. ఇదిలా ఉంటే సూర్య ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువ’లో నటిస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అందరిలోనూ అంచనాలు ఉన్నాయి. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా కంగ అనే పరాక్రముడి కథతో ‘కంగువ’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ గురించి నిర్మాత ధనంజయన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇది తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్నారు. సినిమా పూర్తి కాకముందే విడుదల తేదీ ప్రకటించి ఒత్తిడికి గురికావడం తమకు ఏ మాత్రమూ ఇష్టం లేదని తెలిపారు.

Advertisement

ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌ అని అన్నారు. 3డి, సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్లనే తామింకా రిలీజ్ డేట్‌ని నిర్ణయించలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే సూర్య పార్ట్ పూర్తయిందని.. ఇంకా బాబీ డియోల్‌పై చిత్రీకరించవలసినవి.. కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉందని తెలిపారు. కాగా ప్రస్తుతం తమ ఫోకస్ అంతా పోస్ట్ ప్రొడక్షన్‌పైనే ఉందని చెప్పుకొచ్చారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×