BigTV English

Shoaib Malik Wedding : షోయబ్‌ మాలిక్ మరో పెళ్లిపై స్పందించిన సానియా కుటుంబం..

Shoaib Malik Wedding : షోయబ్‌ మాలిక్ మరో పెళ్లిపై స్పందించిన సానియా కుటుంబం..
Shoaib Malik Wedding

Shoaib Malik Wedding : షోయబ్‌ మాలిక్ మరో పెళ్లిపై స్పందించిన సానియా కుటుంబం..పాకిస్తాన్ లో మూడో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్ ఫొటోలు ఇండియాలో వైరల్ అయ్యాయి. ఎందుకంటే తను ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త కావడమే అందుకు కారణం. సామాజిక మాధ్యమాలన్నీ షోయబ్ మాలిక్ చుట్టే తిరగడంతో ఎట్టకేలకు సానియా టెన్నీస్ టీమ్, కుటుంబం స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది.


సానియా మీర్జా తన వ్యక్తిగత వివరాలను బయట చెప్పుకునేందుకు ఇష్టపడదు. పబ్లిక్ లైఫ్ కి ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. ఇప్పుడు తన మాజీ భర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ అంశంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్న నేపథ్యంలో స్పందించాల్సి వచ్చింది. షోయబ్ మాలిక్-సానియా మీర్జా ఇద్దరూ కొంతకాలం క్రితమే విడాకులు తీసుకున్నారు. అందువల్ల అది సానియా జీవితంలో గతం మాత్రమే. మరో పెళ్లి చేసుకుని, కొత్త ప్రయాణం మొదలుపెట్టిన షోయబ్ జీవితం బాగుండాలని సానియా కోరుకుంటోంది.. అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఎందుకు వీరిద్దరూ విడిపోయారనే దానిపై క్లారిటీ రాలేదు. కానీ పాకిస్తాన్ మీడియా మాత్రం అసలు విషయాలను రాసింది. అందులో ముఖ్యంగా షోయబ్ మాలిక్ కి అమ్మాయిల పిచ్చి ఉందని రాసింది. అంతేకాదు తనకి వివాహేతర సంబంధాల వల్లనే సానియా మీర్జా విడాకులు తీసుకుందని కూడా తెలిపింది. ఇంట్లో భార్యాపిల్లలు ఉండగా, షోయబ్ తిరుగుళ్లు తగ్గించలేదని కథనాలు రాశారు.


అసలు వీరిద్దరూ విడిపోవడం రెండు కుటుంబాలకు ఇష్టం లేదని సమాచారం. అందుకే షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నా తన కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు. అయితే మాలిక్ సోదరి బహిరంగంగానే తన అక్కసును వెళ్లగక్కింది. దీంతో షోయబ్ వ్యవహారం ఇంట్లోవాళ్లకి నచ్చలేదని తెలిసింది.

అంతేకాదు ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్న సనా జావెద్ అన్నా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని అంటున్నారు. ఎందుకంటే తనకి కూడా ఇది రెండో పెళ్లి కావడమేనని చెబుతున్నారు. ఏదేమైనా షోయబ్ మాలిక్ వ్యక్తిగత జీవితం ఇలా నలుగురిలో నవ్వుల పాలు కావడం దురదృష్టకరం అంటున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×