BigTV English

Shoaib Malik : చీకటి వెలుగుల మధ్య జీవితం.. తొలి ఆసియా క్రికెటర్ గా ‘షోయబ్ మాలిక్’

Shoaib Malik : చీకటి వెలుగుల మధ్య జీవితం.. తొలి ఆసియా క్రికెటర్ గా ‘షోయబ్ మాలిక్’
Shoaib Malik

Shoaib Malik : పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్…పైకెంత సౌమ్యంగా ఉంటాడో, పెళ్లిళ్ల విషయంలో అంత వివాదాస్పదమయ్యాడు. తాజాగా సానియా మీర్జాను కాదని, మూడో పెళ్లి చేసుకుని నెట్టింట్లో తిట్లు తింటున్న షోయబ్ మాలిక్ క్రికెట్ లో ఒక అరుదైన ఘనత సాధించాడు.


ఎప్పుడో పాకిస్తాన్ క్రికెట్ నుంచి రిటైరైపోయాడు కదా… ఇంకేం సాధిస్తాడని అనుకుంటున్నారా? తను వన్డే, టెస్ట్ ల నుంచి రిటైర్ అయ్యాడు గానీ, ఇంకా టీ 20ల నుంచి కాలేదు. అలాగని టీ 20 పాక్ జట్టులో కూడా లేడు. కానీ బయట మాత్రం టీ 20 లీగ్ లు ఆడుతూ అలా 13 వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆసియా క్రికెటర్ గా అవతరించాడు.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఫార్చూన్ బరిషల్ తరఫున బరిలోకి దిగాడు. 17 పరుగులు చేసి టీ 20 కెరీర్ లో 13, 010 పరుగుల మైలు రాయి దాటాడు. మాలిక్ మొత్తం 526 మ్యాచ్ లు ఆడాడు. అలాగే 124 అంతర్జాతీయ టీ 20ల్లో 2,435 పరుగులు చేశాడు. ఇక తర్వాత పాక్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని పలు దేశాల్లో ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. అలా 10,665 పరుగులు చేశాడు.


ఐపీఎల్ లో 7 మ్యాచ్ లు ఆడాడు, తర్వాత పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్,  కరేబియన్ లీగ్  ఇలా పలు దేశాల్లోని ఫ్రాంచైజీల తరఫున ఆడి 13 వేల పరుగుల మైలు రాయి దాటాడు. అయితే యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ మొత్తం 14, 562 పరుగులతో తన ముందున్నాడు.

క్రికెట్ ఎంత గొప్పగా ఆడితే ఏం ఉంది? అతని జీవితం మాత్రం అంత గొప్పగా లేదని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అది కూడా క్రికెట్ లాగే అందంగా ఉంటే ఎంత బాగుండేదని అంటున్నారు. అయితే పాకిస్తాన్ టీ 20 జాతీయ జట్టులోకి రావడానికి 41 సంవత్సరాల మాలిక్ ఇప్పటికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

వచ్చే టీ 20 వరల్డ్ కప్ కి అందుబాటులో ఉంటానని బోర్డుకి బహిరంగంగా తెలిపాడు. ఒకవైపు టీ 20లో వరుస వైఫల్యాలతో తలబొప్పి కడుతున్న పాకిస్తాన్ టీమ్ మేనేజ్మెంట్ మరి షోయబ్ మాలిక్ ఆఫర్ ని పరిగణలోకి తీసుకుంటుందా? తిరస్కరిస్తుందా? అనేది తెలీదు. 99శాతం అవకాశం ఉండదనే  సీనియర్ క్రికెటర్లు అంటున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×