BigTV English

Kanguva Release Date: అక్టోబర్ నుంచి నవంబర్ కి, కంగువ డేట్ మారింది అరాచకం మాత్రం మారదు

Kanguva Release Date: అక్టోబర్ నుంచి నవంబర్ కి, కంగువ డేట్ మారింది అరాచకం మాత్రం మారదు

Kanguva Release Date: కోలీవుడ్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో కంగువ ఒకటి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టిన శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో దర్శకుడుగా కొన్ని సినిమాలు చేసినా కూడా తమిళ్లో వరుస సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్గా అక్కడ పేరు సాధించాడు శివ. చివరగా రజనీకాంత్ తీసిన అన్నత్తే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన శివ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంది అని చెప్పొచ్చు.


కంగువ సినిమాని అక్టోబర్ 10 వ తారీఖున రిలీజ్ చేస్తారు అని ఇదివరకే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా ఆ డేట్ కి రావట్లేదు అని ఊహాగానాలు వినిపించాయి. దీని గురించి అధికారిక ప్రకటన కూడా తాజాగా రిలీజ్ అయింది. అక్టోబర్ 10న రజనీకాంత్ నటిస్తున్న వెట్టేయన్ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రోజు రెండు సినిమాలు పోటీలో పడతాయి అనుకున్న తరుణంలో ఈ సినిమా వెనక్కి తగ్గుతుంది అని వార్తలు వినిపించడం ఆశ్చర్యం అనిపించింది చాలామందికి. ఇక ఈ వార్తలన్నిటికీ అధికారికంగా చెక్ పెట్టేసింది చిత్ర యూనిట్. కంగువ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా స్టూడియో గ్రీన్ సంస్థ అనౌన్స్ చేసింది.

ఇక ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి ఇదివరకే ఈ సినిమా గురించి చాలా సందర్భాల్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ భారీ ఎలివేషన్లు ఇచ్చారు. ఒక సందర్భంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ కంగువ పార్ట్ వన్ సినిమాతో చాలా సినిమాలు పోటీ పడొచ్చు కానీ కంగువ పార్టు 2 విషయంలో మాత్రం ఏ సినిమా పోటీకి రాదు అంటూ తెలిపారు. దీనిని బట్టి కంగువ సినిమా పైన ఆ నిర్మాతకు ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


ఇకపోతే ఈ సినిమాను కేవలం కొద్ది రోజులు మాత్రమే పోస్ట్ పోన్ చేశారు. మామూలుగా తెలుగు సినిమాలైతే ఒక డేట్ మిస్సయింది అంటే దాదాపు 6,7 నెలల వరకు పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు అక్టోబర్ నుంచి సినిమా నవంబర్ కి వెళ్ళింది కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. దీనిని బట్టి కొందరు స్పందిస్తూ సినిమా లేట్ అవ్వచ్చు కానీ సినిమా అరాచకం మాత్రం అంతే ఉంటుంది అంటూ కాన్ఫిడెన్స్ తెలియజేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×