BigTV English

Actress: డ్రగ్స్ కేసులో హీరోయిన్ కి క్లీన్ చిట్ ఇచ్చిన హైకోర్టు.. ఎవరంటే?

Actress: డ్రగ్స్ కేసులో హీరోయిన్ కి క్లీన్ చిట్ ఇచ్చిన హైకోర్టు.. ఎవరంటే?

Actress: సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎంతలా కలకలం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. నెలల తరబడి పోలీసుల చుట్టూ తిరుగుతూ.. ఉన్న పరువును కాస్తా పోగొట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ కి ఊరట లభించింది. డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ కేసు కొట్టి వేసింది. సరైన ఆధారాలు లేకపోవడం వల్లే కేసును కొట్టేసినట్లు సమాచారం. గత నాలుగేళ్లు గా కొనసాగుతున్న ఈ డ్రగ్స్ కారణంగా తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానంటూ పలు సందర్భాలలో ఈ హీరోయిన్ చెప్పుకొచ్చింది.


ఆమె ఎవరో కాదు అందాల తార రాగిణి ద్వివేది (Ragini Dwivedi). కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపిన ఈ డ్రగ్స్ కేసులో ఈమె ఇరుక్కోవడంతో అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ డ్రగ్స్ వ్యవహారంలో నాలుగేళ్ల క్రితం అంటే, 2020 సెప్టెంబర్ లో ఈమె అరెస్ట్ అయ్యారు చాలా రోజులపాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇప్పుడు ఈ కేసులో నాలుగేళ్ల తర్వాత నిర్దోషి అని తేలింది. ఇప్పటి వరకు నటికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాదారాలు లభించకపోవడంతో కేసులో ఈమెను నిర్దోషిగా భావిస్తూ హైకోర్టు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ హీరోయిన్ కి పెద్ద ఊరట లభించిందని చెప్పవచ్చు.

అసలు విషయంలోకి వెళ్తే.. 2020లో కన్నడ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రాగిణికి డ్రగ్స్ మాఫియా తో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పార్టీ పెట్టి డ్రగ్స్ వాడేందుకు ప్రోత్సహించారని ఈ అందాల ముద్దుగుమ్మ పై అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఇందుకు సంబంధించి రాగిణి పై నార్కోటిక్స్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టం కింద కేసు కూడా నమోదు చేసి, ఈమెను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతుండడంతో సహా నిందితుల వాంగ్మూలం ఆధారంగానే ఈమెపై కేసు నమోదు చేశారు. అయితే రాగిణి తరఫు న్యాయవాది ఏమాత్రం ఎలాంటి ఆధారాలు అందించలేదని న్యాయస్థానానికి తెలియజేశారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తి హేమంత్ చందన్ గౌడ్ నేతృత్వంలో కర్ణాటక హైకోర్టు సింగిల్ మెంబర్ బెంచ్ ఈ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ కేసులో ఏ 4 గా నిలిచిన ప్రశాంత్ రాంకాపై కేసు కూడా కొట్టి వేయబడడం జరిగింది. మొత్తానికి అయితే గత నాలుగేళ్లుగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో నలిగిపోతున్న ఈమెకు భారీ ఊరట లభించింది.


రాగిణి ద్వివేది నటించిన చిత్రాలు..

కన్నడలో పలు సినిమాలలో నటించిన ఈమె నాయక, కెంపగౌడ, హోలీ, శంకర్ ఐపిఎస్, గోకుల, విక్టరీ, రాగిణి ఐపీఎస్, శివం, నమస్తే మేడం, ఆరక్షణ , విక్టరీ, కిచ్ తదితర హిట్ చిత్రాలలో నటించి పేరు దక్కించుకుంది. ఇక సముద్రఖని (Samudrakhani) దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించిన ‘జెండాపై కపిరాజు ‘అనే సినిమాలో కూడా ఒక కీలకపాత్ర పోషించింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×