BigTV English

Supermarket Offer Husband Affair : సూపర్ మార్కెట్ ఆఫర్‌తో భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు.. భార్య తెలివిగా..

Supermarket Offer Husband Affair : సూపర్ మార్కెట్ ఆఫర్‌తో భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు.. భార్య తెలివిగా..

Supermarket Offer Reveals Husband Affair | ఈ రోజుల్లో అన్ని సూపర్ మార్కెట్లు సాధారణంగా కస్టమర్లను ఆకర్షించడానికి ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటాయి. రెగులర్ కస్టమర్ల కోసమైతే రివార్డ్ పాయింట్స్ సూపర్ మార్కెట్ యజమాన్యం ఇస్తూ ఉంటుంది. వాటితో ఏదైనా ఇతర వస్తువు ఉచితంగా కొనేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి రివార్డ్ పాయింట్స్ కస్టమర్స్ పెద్దగా పట్టించుకోరు. వాటితో పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తుంటారు. కానీ ఒక భార్య ఈ రివార్డ్ పాయింట్స్ ద్వారా తన భర్త అక్రమ సంబంధం గురించి తెలుసుకుంది. ఈ ఘటన ఆస్ట్రేలియా దేశంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ కు చెందిన క్రిస్టీ జోనాస్ కు పీటర్ జొనాస్ తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరూ క్వీన్స్ ల్యాండ్ లోనే కాపురం ఉంటున్నారు. అయితే పీటర్ తల్లిదండ్రులు పక్క రాష్ట్రమైన న్యూ సౌత్ వేల్స్ లో జీవిస్తున్నారు. పీటీర్ అతని తల్లిదండ్రుల వద్దకు ఎక్కువగా వెళ్లేవాడు కాదు. కానీ గత మూడు నెలలుగా అతను తరుచూ తన తల్లిదండ్రులను కలిసేందకు న్యూ సౌత్ వేల్స్ వెళుతున్నాడు. దీంతో క్రిస్టీ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తోంది.

భర్తకు ఫోన్ చేస్తే అతను ఎప్పుడూ బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేసేవాడు. దీంతో క్రిస్టీకి అనుమానం వచ్చింది. ఎందుకంటే వారిద్దరికీ వివాహం జరుగకముందు పీటర్ కు ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. అయితే ఆమెతో పీటర్ బ్రేకప్ చేసుకున్నాడు. కానీ కొన్ని నెలల క్రితం ఆమె తరుచూ పీటర్ కు ఫోన్ చేస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో పీటర్ ఇటీవల ఇంట్లో ఉండకపోవడంతో క్రిస్టీ కి తన భర్త పట్ల అనుమానం కలిగింది. కానీ పీటర్ అంటే క్రిస్టీకి విపరీతమైన ప్రేమ. అందుకోసం అతడిపై ఆరోపణలు చేసేముందు నిజనిర్ధారణ చేసుకోవడం మంచిదని భావించింది. ఈ కారణంగా వివాహేతర సంబంధాలు కలిగిన భర్తల గురించి తెలుసుకోవాలని భావించే మహిళల కోసం ఆస్ట్రేలియా ఒక డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న మిస్ కాస్ అనే మహిళను క్రిస్టీ సంప్రదించింది.


Also Reward: పెళ్లయిన ఏడాది తర్వాత నరకం చూపిస్తున్న భార్య.. నెట్టింట బాధ చెప్పుకొని భోరుమన్న భర్త!

క్రిస్టీ తన భర్త పీటర్ అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానంగా ఉందని మిస్ కాస్ తో చెప్పింది. కానీ నిజమేంటో తెలుసుకోవాడానికి సాయం చేయమని ఆమెను అడిగింది. దానికి మిస్ కాస్ ఆమె వద్ద నామ మాత్రపు ఫీజు తీసుకొని.. ముందుగా భార్యాభర్తలిద్దిరికీ ఏదైనా జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉందా? అని అడిగింది. దానికి క్రిస్టీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. అది పీటర్ ఉపయోగిస్తున్నాడని చెప్పింది.

అయితే ముందుగా ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకురావాలని అడిగింది. మిస్ కాస్ చెప్పినట్లుగా క్రిస్టీ.. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకువచ్చింది. అందులో పీటర్ ఇంట్లో లేని సమయంలో షాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. పీటర్ తరుచూ కోల్స్ అనే సూపర్ మార్కెట్లో, బన్నింగ్స్ అనే హర్డ్ వేర్ షాపులో కొనుగోలు చేసి తన డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తున్నట్లు తెలిసింది. కానీ ఈ సూపర్ మార్టెట్లు ఆస్ట్రేలియా మొత్తం వ్యాపించి ఉన్నాయి. అందువల్ల పీటర్ ఎక్కడ నుంచి షాపింగ్ చేస్తున్నాడనేది తెలియడం కష్టం.

అప్పుడు డిటెక్టివ్ మిస్ కాస్ మరో ఐడియా చెప్పింది. కోల్స్ సూపర్ మార్కెట్లో రెగులర్ కస్టమర్లకు ఫ్లై బై అనే రివార్డ్ పాయింట్స్ ఇస్తారు వాటిని క్రిస్టీ, పీటర్ ఉపయోగిస్తున్నారా? అని ప్రశ్నించింది. దీంతో క్రిస్టీ.. అప్పుడప్పడూ పీటర్ వినియోగిస్తాడని చెప్పింది. అయితే ఈ రివార్డ్ పాయింట్స్ కేవలం కోల్స్ సూపర్ మార్కెట్ కు చెందిన కొన్ని ప్రత్యేక బ్రాంచీలలో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. దీంతో క్రిస్టీ.. తమ సూపర్ మార్కెట్ రెగులర్ కస్టమర్ కార్డు ద్వారా కోల్స్ సూపర్ మార్కెట్ కు వెళ్లి.. అందులోని రివార్డ్ పాయింట్స్ ఏ బ్రాంచీలలో కొనుగోలు చేస్తే వచ్చాయో వాటిని ఎక్కడు ఉపయోగించాలో ఆరా తీసింది.

అప్పుడు సూపర్ మార్కెట్ యజమాన్యం చెప్పింది విని క్రిస్టీ షాక్ కు గురైంది. ఎందుకంటే ఆమె భర్త పీటర్.. ఇన్నాళ్లు తన తల్లిదండ్రులను కలిసేందుకు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రానికి వెళ్లనేలేదు. అతను వారి ఇంటికి సమీపంలోని మరో ప్రాంతంలో ఉన్న కోల్స్ సూపర్ మార్కెట్ నుంచే షాపింగ్ చేస్తున్నట్లు రికార్డ్ కనిపించింది. దీంతో క్రిస్టీ ఆ ప్రాంతానికి వెళ్లి తన భర్త కోసం గాలించింది. వరుసగా మూడు రోజులపాటు గాలిస్తే.. ఆమె భర్త తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు కనిపించాడు. అంతే క్రిస్టీ వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

ఈ స్టోరీ మొత్తం డిటెక్టివ్ మిస్ కాస్ ఇటీవల సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె పెట్టిన పోస్టులు నెట్టింట బాగానే వైరల్ అవుతున్నాయి.

Related News

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Viral Video: నడి రోడ్డుపై భర్తను ఉతికి ఆరేసిన భార్య.. పెళ్లికాని ప్రసాదులు మీరు చాలా లక్కీ!

Viral News: పానీ పూరీల కోసం రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన మహిళ.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!

Big Stories

×