BigTV English

Jai Hanuman : ‘జై హనుమాన్’ లీడ్ రోల్ లో కన్నడ స్టార్ .. థియేటర్లు దద్ధరిల్లాల్సిందే..

Jai Hanuman : ‘జై హనుమాన్’ లీడ్ రోల్ లో కన్నడ స్టార్ .. థియేటర్లు దద్ధరిల్లాల్సిందే..

Jai Hanuman : ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమాల్లో హనుమాన్ (Hanuman ) మూవీ కూడా ఒకటి . ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హనుమాన్ మూవీ కలెక్షన్స్ దాదాపుగా 400 కోట్ల వరకు రాబట్టింది. ఈ సినిమా అసలు స్టోరీని జై హనుమాన్( Jai Hanuman ) సినిమాలో చూస్తారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Prasanth Varma ) ఎప్పుడో చెప్పాడు . కానీ ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు కనిపించలేదు. అదిగో ఇదిగో అంటూ చెబుతున్నదే తప్ప ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. తాజాగా ఈ మూవీలో లీడ్ రోల్ చేసేది అతనే అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈసారి ఏకంగా కన్నడ స్టార్ ను దించుతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం..


హనుమాన్ జయంతి రోజున స్క్రిప్ట్ పని మొదలు అన్నట్లు ఒక పోస్ట్ చేసాడు. ఇక దసరా సందర్భంగా మరో ట్వీట్ చేసాడు. పీవీసీయూలో మూడో ప్రాజెక్ట్ అని అందులో ఉంది. బ్యాక్ గ్రౌండ్‌లో హనుమాన్ థీమ్ ఉంది. అంటే అది జై హనుమాన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ మూడో ప్రాజెక్ట్ అని ఉంది.. రెండో ప్రాజెక్ట్ ఏంటి? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో లీడ్ రోల్ గురించి రివీల్ చేసారు. అందరు ఊహించినట్లు కాకుండా కొత్తగా ఉండేలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో కన్నడ స్టార్ కాంతారా ఫేమ్ హీరో రిషబ్ శెట్టి ( Rishab Shetty ) లీడ్ రోల్ లో చేయనున్నారు. అయితే హనుమాన్ గానా లేదా రాముడిగానా అనేది కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. దీని పై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం. అలాగే వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది .

ఇక ప్రశాంత్ వర్మ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే పనిలో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. అధీరా, నందమూరి మోక్షజ్ఞ  ( Nandamuri Mokshagna ) ను లాంచ్ చెయ్యబోతున్నాడు. అలాగే , జై హనుమాన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. పీవీసీయూలో భాగంగా మరికొన్ని ప్రాజెక్టులు కూడా రెడీ అవుతున్నాయి. తన టీంలోని అసిస్టెంట్ డైరెక్టర్లతోనూ ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నాడు. ఆయన లైనప్ లో కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక సినిమాలకు కథను , దర్శకత్వం చెయ్యడంతో పాటుగా ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. మహాకాళి అనే లేడి ఓరియెంటెడ్ మూవీకి కథ , స్క్రీన్ ప్లే తో పాటుగా సినిమాను నిర్మిస్తున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. హనుమాన్ బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ సంక్రాంతికి జై హనుమాన్‌ను దించుతామని ప్రశాంత్ వర్మ అన్నాడు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కనీసం వచ్చే సంక్రాంతికి ఒక్క సినిమా అయినా విడుదల చేస్తాడేమో చూడాలి..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×