BigTV English

Nithiin: నితిన్ బర్త్‌డే స్పెషల్.. పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా పోస్టర్ రిలీజ్

Nithiin: నితిన్ బర్త్‌డే స్పెషల్.. పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా పోస్టర్ రిలీజ్
Nithiin
Nithiin

Nithiin:టాలీవుడ్ హీరో నితిన్‌కు హిట్టు పడి చాలా కాలమే అయింది. వరుస పెట్టి సినిమాలు తీస్తున్నా.. పెద్దగా ఫలితం దక్కడం లేదు. డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ కొత్త కొత్త పాత్రలతో అలరిస్తున్నాడు. అయితే గతేడాది ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


ఎన్నో అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ అందరి అంచనాలను తలకిందులు చేసేసింది. బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో అటు నితిన్‌తో పాటు అభిమానుల ఆశలు నిరాశలుగా మిగిలాయి. అయితే ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు.

ఇందులో భాగంగా తన వద్దుకు వచ్చిన కథలలో డిఫరెంట్‌గా ఉన్న చిత్రాలనే ఎంపిక చేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నేడు నితిన్ బర్త్ డే సందర్భంగా తాను నటిస్తోన్న కొత్త సినిమా ‘తమ్ముడు’ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.


Also Read: టిల్లుగాని కోట్ల ఊచకోత.. తుక్కు తుక్కుగా డీజే కొట్టాడుగా..!

ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ డైరెక్టర్ ఇంతకముందు వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు నితిన్ మూవీకి దర్శకత్వం వహిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అదీగాక రిలీజ్ అయిన పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తుంది. అందులో ఓ లారీ మీద ఒక శూలాన్ని పట్టుకుని కూర్చిని కనిపిస్తున్నాడు. అయితే లారీ లోపల కొందరు కూర్చుని ఉండగా.. ఒక లేడీ ఆ లారీని డ్రైవ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. సినిమాలో ఒక ఫైట్ సీన్‌లో భాగంగా కొందరు అధికారుల్ని నితిన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ లారీ డ్రైవ్ చేసే లేడీ ఎవరనేది మాత్రం తెలియకుంటుంది.

మొత్తానికి ఈ పోస్టర్‌తోనే సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాడు నితిన్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ వైజాగ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ‘కాంతార’ సినిమాకి మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ ‘తమ్ముడు’ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

Also Read: ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్ రెడీ.. టైటిల్ రివీల్ చేసిన దర్శకుడు

ఇక ఈ మూవీతో పాటు నితిన్ లైనప్‌లో మరో సినిమా ఉంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నితిన్ ఒక దొంగగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినీ ప్రియుల్లో ఫుల్ జోష్ నింపింది. ఇక మొత్తంగా చూసుకుంటే నితిన్ కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×