BigTV English

Kantara Chapter-1: హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని రంగంలోకి దింపిన ‘కాంతారా’ టీమ్..!

Kantara Chapter-1: హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని రంగంలోకి దింపిన ‘కాంతారా’ టీమ్..!

Hollywood Technician for Kantara Chapter -1: కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌ను అందుకుంటాయి. అంతేకాకుండా ఒక చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. అందులో ‘కాంతార’ మూవీ ముందుంటుంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు లేవు.. గ్రాండ్‌ లెవెల్లో ప్రమోషన్స్ చేసేంత పెద్ద సినిమా కూడా కాదు.. భారీ బడ్జెట్‌ మూవీ అంతకన్నా కాదు. కానీ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం గూస్‌బంప్స్ తెప్పించే సీన్లతో కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.


కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసింది. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దుమ్ము దులిపేసింది. ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టింది. అంతేకాకుండా పలు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ఈ మూవీ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తన హవా చూపించి అదరగొట్టేసింది.

‘కాంతార’ మూవీ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ప్రీక్వెల్ గ్రాండ్ లెవెల్లో సిద్ధమవుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రీక్వెల్ మూవీపై భారీ హైప్ ఉంది. అంతేకాకుండా కాంతార భారీ విజయం సాధించడంతో మూవీ మేకర్స్ ఈ చాప్టర్ 1ను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. కాంతార కంటే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.


Also Read: ‘కాంతార చాప్టర్ 1’ లో స్టార్ యాక్టర్.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

ఇందులో భాగంగానే ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్‌ నుంచి టెక్నీషియన్ టీమ్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో భారీ గ్రాఫిక్స్‌ కోసం ‘కాంతార’ టీం ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్థతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘బ్యాట్‌మ్యాన్’ వంటి హాలీవుడ్ సినిమాలకు వీఎఫ్ఎక్స్ అందించిన సంస్థ ఇప్పుడు ‘కాంతార చాప్టర్ 1’ కోసం పని చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×