BigTV English

Fire Accident in Kuwait: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 40 మంది భారతీయులు సజీవదహనం!

Fire Accident in Kuwait: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 40 మంది భారతీయులు సజీవదహనం!

40 Indians Killed in Fire Accident in Kuwait: కువైట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 43 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 40 భారతీయులే కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.


కువైట్ లోని అహ్మదీ గవర్నరేట్ లోని మంగాఫ్ బ్లాక్ లో 6 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మరో 30 మంది భారతీయులు గాయపడ్డారు. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు లేబర్ క్యాంపులోని కింది అంతస్తులోని ఒక వంటగదిలో మంటలు చెలరేగాయి. అవి క్రమంగా అపార్ట్మెంట్ లోని అన్ని గదులకు వ్యాపించాయి.

కొందరు ప్రాణాలను దక్కించుకునేందుకు అగ్నిప్రమాదాన్ని గమనించి బయటకు దూకడంతో మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరికొందరు పొగ పీల్చడంతో, కాలిన గాయాలతో ఊపిరాడక మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు అదాన్, జాబర్, ముబారక్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సంభవించిన భవనంలో ఎక్కువగా తమిళనాడు, కేరళ, ఉత్తర భారత ప్రజలు నివసిస్తున్నారు.


Also Read: Congo Boat Capsized 86 People Killed: కాంగోలో పడవ బోల్తా, 86 మంది మృతి.. కారణం అదే..

కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ, విదేశాంగ వ్వవహారాల శాఖ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని మోదీ ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు అక్కడి అధికారులతో కలిసి భారత రాయబార కార్యాలయం కలసి పనిచేస్తోందని పేర్కొన్నారు.

Tags

Related News

Nobel Prize Economics: ఎకానమీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్.. వారు ఏ దేశాలంటే..?

California: చెట్టును తాకి లైవ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Big Stories

×