అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఈ మూవీ తన హవా చూపించింది. ఇక అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఈ సినిమాకి ప్రీక్వెల్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్రం ‘చాప్టర్ 1’గా రూపుదిద్దుకుంటోంది. రిషబ్ శెట్టి ఈ చాప్టర్ 1లో కూడా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవెల్లో ఏ విషయంలోను తగ్గకుండా నిర్మిస్తుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అదరగొట్టేసింది. అంతేకాకుండా దీని గ్లింప్స్ సినిమాపై ఎనలేని అంచనాలను పెంచేసింది. దీంతో ఈ చాప్లర్ 1 కూడా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు.
Also Read: వైరల్ అవుతున్న ‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ లుక్.. టీజర్ రిలీజ్..
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో ప్రముఖ హీరో కీ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ నటుడు జయరామ్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే జయరామ్ ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
అల వైకుంఠపురములో, గుంటూరు కారం వంటి సినిమాలతో మరెన్నో చిత్రాల్లో నటించిన జయరామ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అలాంటి ఈ స్టార్ యాక్టర్ ఇప్పుడు కాంతారలో నటిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయింది. దీనిపై త్వరలో మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.