Parvati Devi : పార్వతిదేవీని మనం ఎన్నో రూపాల్లో ఆరాధిస్తూ ఉంటాం. వేదకాలంలో రురుడు అనే రాక్షసునికి ఒక పుత్రుడు పుట్టాడు. అతనికి దుర్గమముడు అని పేరు. దేవతల మహోన్నతి చూసి అసంతృప్తితో మదన పడేవాడు. దేవదానవులు కశ్యప ప్రజాపతికి బిడ్డలై ఉండి కూడా సోదరులైన రాక్షసులను బాధించి వదించి చేయగల శక్తి ఎక్కడ నుంచి వచ్చిందోనని తెగ ఆలోచించే వాడు. దానవ పెద్దలు దేవతల సర్వశక్తికీ వేదాలే కారణమని దుర్గమునికి బోధించారు.
దుర్గముడు వజ్రసంకల్పంతో కఠినమైన దీక్షతో చాలా సంవత్సరాల పాటు పరబ్రహ్మను గురించి తప్పస్సు చేశాడు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని సాధించాడు. ఏం వరం కావాలోకోరుకోమన్నాడు బ్రహ్మదేవుడు. వేదాలను తనకు ధారాదత్తం చేయాలని, ఎవరూ వేదగానం చేయకూడదని అందరూ వేదాలను మరిచిపోవాలని కోరాడట. అన్యమార్గం లేక బ్రహ్మ వరమిచ్చాడు.
శాకాహారానికి అలా పేరు వచ్చింది
నాటితో దేవ, బ్రాహ్మణ గణాలందరికీ వేదాలు గుర్తుకు రాక యజ్ఞయాగాలన్నీ నిలిచిపోయాయి. దేవతలు హవిస్సు అందక శక్తిహీనులపై పోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్షజాతి క్షీణించింది. ఋషులు, దేవతలు పార్వతీమాతను ప్రార్ధించగా మహామాత ప్రత్యక్షమై ఆకలితో అలమటిస్తున్న రుషులందరికీ ఆకుకూరలు ఇచ్చి తినిపించింది. అప్పుడు అందరూ ఆమెను శాకంబరీ దేవీగా స్తుతించారు. ఆనాటి నుంచి సాత్విక ఆహారానికి శాకాహారమని పేరొచ్చింది.
9 రోజులపాటు సంహారం
దుర్గముడి శక్తి స్వరూపణి సంహారాని నిర్ణయించుకుంది. అప్పుడు ఆ శక్తి స్వరూపం నుంచి కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన శక్తులు 32 మంది పుట్టి దుర్గముడి రాక్షస సైన్యాన్ని 9 రోజులపాటు సంహరించారు. దుర్గముడు ఎంత పోరాడినా శక్తిస్వరూపిణిని ఎదుర్కోలేక పోయాడు. దుర్గముడ్ని వధించిన కారణంగా పార్వతి దేవిని దుర్గ అని పిలుస్తారు.