BigTV English

Karan Johar: కరణ్ ధరించే టై విలువ తెలిస్తే షాక్..!

Karan Johar: కరణ్ ధరించే టై విలువ తెలిస్తే షాక్..!

Karan Johar. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న కరణ్ జోహార్ (Karan Johar) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఈయన ఫ్యాషన్ సెన్స్ కి అభిమానులు అయిపోతున్నారు. ముఖ్యంగా కరణ్ జోహార్ కి ఫ్యాషన్ సెన్స్ ఎక్కువ అందుకే ప్రఖ్యాత డిజైనర్లు కూడా ఆయన కోసం క్యూ కడతారు. అంతేకాదు కరణ్ జోహార్ కోసం ప్రత్యేకమైన డిజైనర్ దుస్తులను కూడా తయారు చేసి ఇస్తూ ఉంటారు. వాటిని ధరించి పబ్లిక్ లో అతడు చేసే ప్రదర్శనలు నిరంతరం చర్చగా మారుతుంటాయి.


కరణ్ ధరించిన నెక్ టై విలువ రూ.2 లక్షలు..

ముఖ్యంగా పెళ్లికి వెళ్లినా, అవార్డు ఫంక్షన్ కి వెళ్లినా కాఫీ విత్ కరణ్ షోలో కనిపించినా సరే ప్రతిసారి కూడా ఒక స్టార్ హీరో కంటే ఎక్కువగానే తన ఫ్యాషన్ సెన్స్ తో హైలెట్ అవుతూ ఉంటాడు. అంతేకాదు రణవీర్ సింగ్ తరహాలో బోల్డ్ అవతారంలో కనిపించడానికి కూడా ఆయన వెనుకాడడు. ఈ క్రమంలోనే కరణ్ ఫ్యాషన్ సెన్స్ ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. ఇటీవల ముంబై ఈవెంట్ లో తన ఉన్నతమైన ఫ్యాషన్ శైలిని ప్రదర్శించాడు కరణ్. అయితే ఈసారి అతడు అసాధారణమైన ఫ్యాషన్ లేబుల్ షియాపరెల్లి రూపకల్పనలోని హెయిర్ స్టైల్ తో కనిపించి అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకట్టుకున్నాడు. లగ్జరీ స్కిన్ కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్ ను భారతదేశంలో ప్రారంభించిన నేపథ్యంలో చిత్ర నిర్మాత కరణ్ జోహార్ లేబుల్ క్రిస్టెల్లి నుండి లేత గోధుమ రంగు సూట్ ధరించి చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. అయితే ఈయన టై విషయంలోనే ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్ షియాపరెల్లి ఆటం వింటర్ 2024 కలెక్షన్స్ నుండి అల్లిన హెయిర్ లుక్ డిజైన్ తో నెక్ టై.. సాంప్రదాయ నెక్ వేర్ తో పోలిస్తే చాలా ప్రత్యేకంగా అనిపించింది. ముఖ్యంగా ఈ టై ఒక అందగత్తే జడ లా కనిపిస్తోంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక దీని విలువ అక్షరాల రూ.2 లక్షలు. ముఖ్యంగా ఈ టై కరణ్ స్టైలిష్ ను మరింత హైలెట్ చేసిందని చెప్పాలి.. ప్యారిస్ రెడీ టు వేర్ ఫ్యాషన్ వీక్ లో ఇదే టైం మొదటిసారి కనిపించింది. నిజానికీ షియాపరెల్లి కచేరీలలో ఇది ఒక డిజైనర్ పీస్ కూడా.. ఇప్పుడు దీనికి కరణ్ జోహార్ మరింత పాపులారిటీ పెంచేశారు.


కరణ్ జోహార్ కెరియర్..

ఇక కరణ్ జోహార్ విషయానికి వస్తే ఇటీవల నిర్మాణరంగంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. తన నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్ హౌస్ లో మెజారిటీ షేర్ ను సారేగమ సంస్థకు విక్రయించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. మరొకవైపు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంటూ సెలబ్రిటీల నుంచి పలు ఆసక్తికరమైన విషయాలను బయటకు లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తానికి అయితే కరణ్ జోహార్ తన మాటలతోనే కాదు ఫ్యాషన్ సెన్స్ తో కూడా ఎప్పటికప్పుడు మాటల్లో నిలుస్తున్నాడు అని చెప్పవచ్చు.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×