Poonam kaur: తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఈమధ్య ఈమె నిత్యం వార్తల్లో హైలైట్ అవుతూ వస్తుంది.. హీరోయిన్ గా సక్సెస్ అవ్వని ఈ అమ్మడు ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ గా మారింది. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలతో తరచూ వివాదాలకు కారణమవుతున్న పూనమ్ కౌర్ మరోసారి తన పోస్ట్ తో రెచ్చిపోయింది. స్త్రీల వస్త్రదారణ పై ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.. తాజాగా వాటిపై స్పందిస్తూ పోస్ట్ చేసింది. అది కాస్త హాట్ టాపిక్ గా మారింది.. ఆ పోస్ట్ లో ఏముందో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై ఈమె సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే.. తాజాగా మరోసారి డైరెక్టర్ పై రెచ్చిపోయింది.. కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది. అందులో ఏముందంటే.. స్త్రీలను హింసించి, వారికి మానసిక క్షోభను మిగిల్చి, ఏమీ తెలియనట్లు తిరిగే వ్యక్తులు నిజంగా దుర్మార్గులు. ఇలాంటి వారికి మద్దతు ఇచ్చే మీడియా, బాధ్యతను ప్రశ్నించని ‘మా’ అసోసియేషన్ వంటి సంస్థల వల్లే మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. ఒక చిన్న వ్యాఖ్యను పట్టించుకునే మీరు, ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోవడం వల్లే మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని పోస్ట్ లో రాసుకొచ్చింది.. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.. డైరెక్టర్ త్రివిక్రమ్ పై ఈమె కౌంటర్ ఇవ్వడం మొదటిసారి ఏమీ కాదు. గతంలో చాలాసార్లు ఆయనపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టింది..
Also Read : ప్రేమతో ప్రభాస్ ఫ్యాన్స్ బిర్యానీ పంపిస్తే… మారుతి తినకుండా ఇలా చేశాడా?
విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ మూవీ నువ్వు నాకు నచ్చావు సంక్రాంతి కానుకగా మరోసారి థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చిన త్రివిక్రమ్ సినిమాల గురించి చాలా గొప్పగా చెప్పారు. అందులో ఆయన కొన్ని సినిమాలు డబ్బులు తీసుకొస్తాయి. మరికొన్ని సినిమాలు పేరుని తీసుకొస్తాయి. గౌరవాన్ని మాత్రం కొద్ది సినిమాలు తీసుకొస్తాయి అని త్రివిక్రమ్ చెప్పారు.. ఆ వీడియో పై రియాక్ట్ అయిన పూనమ్ ఈ పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి దీనిపై త్రివిక్రమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. పూనమ్ కౌర్ ఈమధ్య సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. ఈమె బీజేపీ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇకముందు సినిమాలు చేస్తుందా లేదా అన్నది తెలియాలి. ఇకత్రివిక్రమ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఏనా వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు..