E-Paper
Advertisement

Vijay – Rashmika: విజయ్ – రష్మిక పెళ్లికి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ.. ఆశ్చర్యపరుస్తున్న అతిథుల లిస్ట్!

Vijay – Rashmika: విజయ్ – రష్మిక పెళ్లికి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ.. ఆశ్చర్యపరుస్తున్న అతిథుల లిస్ట్!
Advertisement

Vijay – Rashmika:తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 6 సంవత్సరాలకు పైగా తమ బంధాన్ని రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఎట్టకేలకు ఒకటి కాబోతున్నారు..విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) గీతాగోవిందం సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇద్దరు కలిసి చట్టపట్టలేసుకొని తిరిగారు.

రహస్యంగా నిశ్చితార్థం..

పైగా రష్మిక మందన్న అక్కడక్కడ హింట్ ఇస్తూ వచ్చింది కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయంపై ఎక్కడ స్పందించలేదు. దీనికి తోడు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు .ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు అని అభిమానులు అనుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. ఇకపోతే నిశ్చితార్థం తర్వాత తొలిసారి పుట్టపర్తి సాయిబాబా సమాధిని విజయ్ దేవరకొండ దర్శించుకున్నప్పుడు.. అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా ఆయన చేతి వేళ్ళకి ఉన్న డైమండ్ రింగ్ బయటపడింది. అలాగే రష్మిక మందన్న కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా ..ఆమె వేలికి ఉన్న ఉంగరం కూడా అందరిని ఆకట్టుకుంది . దీనితో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందనే విషయంపై నిర్ధారణకు వచ్చారు ఫ్యాన్స్.

పెళ్లికి సిద్ధమవుతున్న జంట..

Advertisement

ఇలా నిశ్చితార్థపు విషయం బయటకు వచ్చిందో లేదో అప్పుడే ఫిబ్రవరి 26 2026న ఉదయపూర్ లోని ఒక చారిత్రక ప్యాలెస్ లో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని.. అయితే ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు. కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలు నిజం కాబోతున్నాయని చెప్పవచ్చు. అటు ఉదయపూర్ లోని తమ పెళ్లి వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను దగ్గరుండి మరీ ఈ జంట చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా వీళ్ళిద్దరూ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన దృశ్యాలు కూడా పెళ్లికి సిద్ధమవుతున్న విషయాన్ని స్పష్టం చేశాయి.

పెళ్లికి ముఖేష్ అంబానీ కుటుంబం..

ఇకపోతే అత్యంత సన్నిహితులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఊహించని అప్డేట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రపంచ కుబేరులలో ఒకరిగా పేరు దక్కించుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీ విజయ్ – రష్మిక వివాహానికి హాజరు కాబోతున్నారట. ఇక ప్రస్తుతం ఈ విషయము సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఘనంగా రిసెప్షన్.. అతిథులు వీరే..

Advertisement

ఇకపోతే సెలబ్రిటీలు అందరూ కూడా తమ పనులను పక్కన పెట్టి .. ఉదయపూర్ లో జరిగే వివాహానికి రాలేరు కాబట్టే అందరి అవసరాలను , పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ హోటల్ లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ లో ఉండే నిర్మాతలు , సెలబ్రిటీలతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy vanga), అల్లు అర్జున్ (Allu Arjun)ఫ్యామిలీలు ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ కి హాజరు కాబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ముఖేష్ అంబానీ తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు హాజరు కాబోతున్నారని తెలిసి ప్రతి ఒక్కరు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

ALSO READ: Actor Sivaji: స్త్రీల బట్టలపై శివాజీ కామెంట్స్.. రెండు రోజులు నిద్ర పట్టలేదంటూ!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×