Star Heroine: వివిధ మతాలకు, జాతులకు భారతదేశం పుట్టినిల్లు. ఎన్నో మతాలవారు ఇక్కడ ఐకమత్యంగా కలిసి జీవిస్తూ.. మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే ఒకప్పుడు ఒక మతంలో పుట్టినవారు చివరి శ్వాస వదిలే వరకు అదే మతంలో కొనసాగేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. తమకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తూ.. అందులో ఆనందాన్ని పొందుతున్నారు. ఇకపోతే ఇక్కడ ఒక హీరోయిన్ ఒక్కొక్క దశకు మారుతున్న ప్రతిసారీ ఒక మతాన్ని అనుసరిస్తూ.. ఏకంగా 3 మతాలను మార్చేసింది. ఇంతకూ మరి ఆమె ఎవరు? ఎందుకు అంతలా మతం మార్చుకోవాల్సి వచ్చింది..? అసలేమైంది?అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఏకంగా మూడు మతాలు మారిన కరీనాకపూర్..
హిందువుగా పుట్టి, ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకొని, ప్రస్తుతం క్రిస్టియానిటీ మతాన్ని స్వీకరించి జీవితాన్ని కొనసాగిస్తోంది ఒక స్టార్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలిన కరీనా కపూర్(Kareena Kapoor). పంజాబీ.. హిందూ కుటుంబంలో జన్మించిన ఈమె, ఆ తర్వాత ముస్లిం అయిన సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ను వివాహం చేసుకుంది. ఇక ప్రస్తుతం క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతూ కుటుంబాన్ని, అటు జీవితాన్ని కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కరీనాకపూర్ ఎవరో కాదు రణ్ ధీర్ కపూర్ (Randhir Kapoor) , బబిత కపూర్ (Babitha Kapoor) ల రెండో కుమార్తెగా జన్మించింది. రణ్ ధీర్ కపూర్ హిందూ కుటుంబానికి చెందిన వారు అయినప్పటికీ, ఈయన భార్య బబిత బ్రిటిష్ క్రైస్తవురాలు కావడంతో పుట్టుకతోనే అటు హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే ఇటు క్రైస్తవ మతాన్ని కూడా ఆచరిస్తూ వచ్చింది కరీనా. ఇక మధ్యలో ముస్లిం వ్యక్తి అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా ఒక జీవితంలో మూడు మతాలు మారి కెరీయర్ ను కొనసాగిస్తోంది కరీనాకపూర్.
Puri Jagannath : విజయ్ ‘బెగ్గర్’ అయితే… పూరీ మారినట్టేనా..?
కరీనా మతాలు మారడంపై క్లారిటీ ఇచ్చిన అమ్మమ్మ..
ఇకపోతే ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ అభిమానులు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఎవరైనా సరే తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉందని, ఇందులో కరీనా కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తూ కెరియర్ సాగిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయాలను కరీనాకపూర్ అమ్మమ్మ లలిత డిసిల్వా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. “కరీనా హిందూ కుటుంబంలో జన్మించినా.. ముస్లిం నటుడిని పెళ్లి చేసుకున్నా.. తన తల్లి క్రైస్తవ మతానికి చెందినవారు కాబట్టి ఆ మతాన్ని ఇప్పటికీ అనుసరిస్తూనే వస్తోంది” అంటూ ఆమె తెలిపారు.
కరీనాకపూర్ కెరియర్..
ఇక కరీనాకపూర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా ఒక పేరు దక్కించుకున్న ఈమె అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది. ఒక్కో సినిమాకు రూ.10 నుండి రూ.18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా ఇప్పటివరకు సుమారుగా రూ.500 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇలా కెరియర్ పీక్స్ లో ఉండగానే పటౌడీ యువరాజు అయిన సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు.