BigTV English

Sunita Williams: స్పేస్ స్టేషన్ నుంచి బయల్దేరిన సునీత విలియమ్స్ టీమ్, భూమి పైకి ఎప్పుడు చేరుకుంటారంటే?

Sunita Williams: స్పేస్ స్టేషన్ నుంచి బయల్దేరిన సునీత విలియమ్స్ టీమ్, భూమి పైకి ఎప్పుడు చేరుకుంటారంటే?

– భూమిపైకి సునీత విలియమ్స్ అండ్ టీమ్


– 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తిరుగు ప్రయాణం
– సవాళ్ల మధ్య సేఫ్ జర్నీ సాధ్యమేనా..?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్, విల్ మోర్ లు మరికొద్ది గంటల్లో భూమిపైకి చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం అంతరిక్ష కేంద్రంతో వాహక నౌక అన్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. 10.35 గంటలకు ఈ అన్ డాకింగ్ ప్రక్రియ ముగిసింది. వెంటనే వాహక నౌక భూమిపైకి తిరుగు ప్రయాణం అయింది. బుధవారం తెల్లవారు ఝామున 3.27 నిమిషాలకు ఈ వాహక నౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగాల్సి ఉంది. అనంతరం క్రూ డ్రాగన్ ను సహాయక బృందాలు బయటకు తీసుకొస్తాయి. సేఫ్ ల్యాండింగ్ తర్వాత సునీత విల్మోర్ లు క్రూ డ్రాగన్ నుంచి బయటకు వస్తారు.


టెన్షన్.. టెన్షన్..
గతంలో కూడా పలుమార్లు సునీత విలియమ్స్ సహా ఇతర వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. అక్కడినుంచి జాగ్రత్తగా తిరిగొచ్చారు. కానీ ఈసారి ప్రయాణం మాత్రం చాలా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే.. గతంలోనే వీరి ప్రయాణం ఖరారైనా వాహక నౌక సామర్థ్యంపై అనుమానాలు ఉండటంతో వారు భూమిపైకి వచ్చేందుకు సాహసించలేదు. దీంతో 9 నెలలు వారు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఈసారి పూర్తి జాగ్రత్తలు తీసుకుని డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ని పంపించారు. ఇందులో సునీత, విల్మోర్ భూమిపైకి రావాల్సి ఉంది.

గతేడాది 2024 జూన్ 5న టెస్ట్ మిషన్ కోసం సునీత విలియమ్స్ విల్మోర్ లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వీరిని తీసుకెళ్లిన వాహక నౌక పేరు స్టార్‌ లైనర్. దీన్ని బోయింగ్ సంస్థ తయారు చేసింది. అక్కడ ఎనిమిది రోజులు ఉండి వారు భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. అయితే వాహక నౌకలో కొన్ని లోపాలు తలెత్తాయి. దీంతో వారు అదే నౌకలో తిరిగి వచ్చేందుకు సాహసించలేదు. వాహక నౌకలోని థ్రస్టర్ లో సమస్యలు, హీలియం లీకేజీ వల్ల రిటర్న్ జర్నీ సేఫ్ కాదని వారు ఆందోళన చెందారు. దీంతో ప్రయాణం క్యాన్సిల్ అయింది. 8 రోజులు ఉండాల్సిన వారు చివరకు 9 నెలలు అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. వారు సందేహించిన వాహక నౌక స్టార్ లైనర్ భూమిపై సేఫ్ గా ల్యాండ్ అయింది. అంటే అదే వాహక నౌకలో వారు తిరిగి వస్తే సేఫ్ గానే భూమిపై దిగేవారనమాట. అయితే ఆ తర్వాత వారి తిరుగు ప్రయాణానికి 9 నెలలు టైమ్ పట్టింది. ఇప్పుడు వారి రిటర్న్ జర్నీ కోసం స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేసిన వాహక నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది.

ప్రస్తుతం భూమిపైకి వస్తున్న వాహక నౌకకు నాసా వ్యోమగామి నిక్ హేగ్ పైలట్ గా వ్యవహరిస్తారు. ఇందులో సునీత విలియమ్స్, విల్మోర్ తోపాటు రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఉన్నారు.

అంతరిక్ష కేంద్రం నుంచి తిరుగు ప్రయాణం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉన్నది. అన్నీ అనుకున్నట్టు జరిగినా చివరి క్షణం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే వ్యోమగాములు జాగ్రత్తగా భూమిపై అడుగు పెడతారు. గతంలో భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా కూడా భూమిపైకి తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక కుప్పకూలడంతో ప్రాణాలు వదిలారు. ఆ ఘటనలో కల్పనా చావ్లాతోపాటు ఏడుగురు వ్యోమగాములు దుర్మరణంపాలయ్యారు. వ్యోమనౌక ప్రయాణం సాఫీగానే మొదలైనా.. చివరకు విషాదాంతంగా ముగిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శాస్త్రవేత్తలు. ఏమాత్రం అనుమానం ఉన్నా వ్యోమనౌకను ఖాళీగానే భూమిపైకి తిప్పి పంపించి వేస్తున్నారు. ఇలాగే సునీత విలియమ్స్ ప్రయాణం 9 నెలల క్రితం వాయిదా పడింది. వ్యోమనౌక ప్రయాణం సేఫ్ కాదని తేలడంతో సునీత విలియమ్స్, విల్మోర్ లు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. 9 నెలల క్రితం స్టార్ లైనర్ లో రావాల్సిన వారు ఇప్పుడు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో భూమిపైకి బయలుదేరారు.

సవాళ్లు..
స్పేస్ క్రాఫ్ట్ లు భూమిపైకి తిరిగి వచ్చే క్రమంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. వాహక నౌక వేగంతోపాటు, భూమి గురుత్వాకర్షణ శక్తిని కూడా క్రమక్రమంగా నిరోధించుకుంటూ సేఫ్ ల్యాండింగ్ జరగాల్సి ఉంటుంది. భూమి వాతావరణంలోకి ప్రవేశించే క్రమంలో తొలి సవాల్ ఎదురవుతుంది. క్రూ మాడ్యూల్ అంతరిక్షం నుంచి అత్యధిక వేగంతో భూమిపైకి వస్తుంది. ఆ సమయంలో దాని వేగం గంటకు 27వేల కిలోమీటర్లుగా ఉంటుంది. అంత వేగంతో అది భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తే ఘర్షణ కారణంగా దాదాపు 1600 డిగ్రీల ఉష్ణశక్తి విడుదలవుతుంది. దీన్ని క్రూ మాడ్యూల్ కి ఉన్న ఉష్ణ కవచం గ్రహించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఆ ఉష్ణాన్ని అది విక్షేపణం చేస్తుంది. ఆ తర్వాత క్రమంగా క్రూ మాడ్యూల్ వేగాన్ని నియంత్రిస్తారు. భూమకిి 10 కిలోమీటర్ల ఎత్తులోకి రాగానే వరుసగా ప్యారా చూట్ ల సహాయంతో వేగాన్ని నియంత్రిస్తారు. దీంతో సేఫ్ ల్యాండింగ్ సాధ్యమవుతుంది.

ఇక ల్యాండింగ్ విషయానికొస్తే సముద్రంలో దిగడం, భూమిపై దిగడం అనేవి ఇందులోని రెండు ప్రక్రియలు. వ్యోమ నౌక సముద్రంలో దిగితే దాన్ని స్ప్లాష్ డౌన్ ల్యాండింగ్ అంటారు. భూమిపై దిగితే గ్రౌండ్ ల్యాండింగ్ అంటారు. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ సంస్థ పంపించిన వాహక నౌక స్ప్లాష్ ల్యాండ్ కావాల్సి ఉంది. సముద్రంలో క్రూ మాడ్యూల్ దిగిన తర్వాత దాన్ని రికవరీ టీమ్ ఓడలోకి తీసుకొచ్చి, భూమిపైకి తరలిస్తారు.

ల్యాండింగ్ లో అత్యంత కీలక దశ ఇంకోటి ఉంది. క్రూ మాడ్యూల్ సేఫ్ గా భూమిపైకి వచ్చినా కూడా వ్యోమ గాములు నేరుగా ఒకేసారి భూ వాతావరణంలోకి రావడం ప్రమాదకరం. అందుకే వారికి ఒక ప్రత్యేక మైన కృత్రిమ వాతావరణ పరిస్థితులను సృష్టిస్తారు. అక్కడ వివిధ వైద్య పరీక్షలు చేసి, అనంతరం సహజ వాతావరణంలోకి తీసుకొస్తారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×