Puri Jagannath : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతోమంది స్టార్ హీరోలకు మంచి కెరియర్ అందించారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన దర్శకత్వంలో వస్తున్న ప్రతి సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక చివరిగా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే నిలిచింది. దాంతో కొద్ది కాలం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు మళ్లీ గట్టి కం బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ‘మక్కల్ సెల్వన్’ తో సినిమా చేయడానికి సిద్ధం అయిపోయారు పూరీ జగన్నాథ్.
విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ మూవీ..
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చివరిగా ‘మహారాజా’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ‘విడుదల 2’ లో కూడా నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకి కూడా టైటిల్ ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ సేతుపతికి పూరీ జగన్నాథ్ రాసుకున్న ఒక కథను వినిపించగా.. కథా చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, విజయ్ సేతుపతి కూడా పూరీ జగన్నాథ్ తో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. అంతేకాదు ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ‘బెగ్గర్’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమై విజయ్ సేతుపతి బెగ్గర్ గా మారి.. సక్సెస్ అందుకుంటే గనుక కచ్చితంగా పూరీ జగన్నాథ్ కెరియర్ మారిపోయినట్టే అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఏ మేరకు విజయ్ సేతుపతి పూరీ జగన్నాథ్ కెరీర్ కు అదృష్టంగా మారనున్నారో తెలియాల్సి ఉంది.
పూరీ జగన్నాథ్ కెరియర్..
ఇక పూరీ జగన్నాథ్ విషయానికి వస్తే.. ఒకప్పుడు మహేష్ బాబు(Maheshbabu), రవితేజ(Raviteja ), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతే కాదు ప్రభాస్ (Prabhas) వంటి పాన్ ఇండియా స్టార్ తో కూడా గతంలో సినిమాలు చేసిన చరిత్ర ఆయనది.. అలాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూరీ జగన్నాథ్ గత కొంతకాలంగా సరైన కథను రూపొందించలేకపోతున్నారు. ముఖ్యంగా మునుపటి పూరీ జగన్నాథ్ ఏమైపోయాడు? అని స్టార్ హీరోలు సైతం చర్చించుకుంటున్నారు. మరి కొంతమంది ఏమో ఇంకొక వ్యక్తి ప్రేమలో పడడం వల్లే కథపై ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారు అని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు యంగ్ హీరోలు కూడా ఈయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. మరి పూరీ జగన్నాథ్ ఇన్ని సంఘటనల మధ్య తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కచ్చితంగా ముందడుగు వేయాలని, సరైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని, అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరి వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అసలే పట్టుదలతో రంగంలోకి దిగబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా పూరీ కెరియర్ మారుతుంది అని అభిమానులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు