Kareena kapoor:బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Alikhan)పై కత్తి దాడి జరిగిన సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన ఘటన చూసి బాలీవుడ్ లో ఉన్న చాలా మంది ప్రముఖులు భయాందోళనకు గురయ్యారు.అయితే ఈ దాడి చేసిన వ్యక్తి దొరికినప్పటికీ, ఆ వ్యక్తి దొంగతనానికి వచ్చింది నిజమే కానీ సైఫ్ పై దాడికి దిగింది ఆయన కాదు అంటూ తాజాగా కొన్ని వార్తలు వినిపించాయి. అయితే దీని గురించి పోలీసులు ఇంకా అధికారిక సమాచారం అయితే బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నిందితుడిని పట్టుకొని ఆయన వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా..? సైఫ్ అలీ ఖాన్ మీద పగ పెంచుకున్న వారు ఎవరైనా ఈ దాడి చేయించారా..?లేకపోతే దొంగతనానికి వచ్చి డబ్బులు ఇవ్వకపోతే ఆ వ్యక్తి కత్తితో దాడి చేశారా..?లేక మరేదైనా ఉందా..? అనే కోణంలో కూడా పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యంపై గంటకొక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది..కానీ తాజాగా డాక్టర్లు మాత్రం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం కొద్దికొద్దిగా కుదట పడుతుందని,ఆయన త్వరలోనే మామూలు మనిషి అవుతారని చెప్పుకొచ్చారు. అయితే తన భర్త పై జరిగిన కత్తి దాడి గురించి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసింది నటి కరీనా కపూర్.
సమయం కావాలంటూ కోరిన కరీనాకపూర్..
కరీనా కపూర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ గా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కష్ట సమయంలో మీరు మాకు మద్దతు ఇవ్వండి. కానీ ఊహాజనిత వార్తలను ప్రచారం చేయకండి. ఈ సమయంలో మీరు మాపై చూపిస్తున్న అభిమానానికి ఎంతో అభినందిస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించి ఊహాజనిత వార్తలను మీడియా వాళ్ళు నమ్మకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ ఘటన నుండి మేము పూర్తిగా బయటపడే వరకు మాకు సంబంధించిన విషయాలను వ్యక్తిగతంగా ఉంచాలి అనుకుంటున్నాం. మాకు ఈ ఘటన నుండి బయటపడడం కోసం కాస్త వ్యక్తిగత సమయం ఇవ్వండి అంటూ కరీనా కపూర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది.ప్రస్తుతం ఈ పోస్ట్ చూసి చాలా మంది నెటిజన్లు కరీనాకపూర్ కి మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు ఈ విషయంలో ఎలాంటి ఊహాజనిత వార్తలు ప్రచారం చేయమని కూడా కామెంట్లు పెడుతున్నారు.
సైఫ్ పై దారుణంగా కత్తి దాడి..
అయితే సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడిలో ఆయన వెన్నెముకతో పాటు మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయని, దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ అడ్డుపడడంతో కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారట.. కానీ ఇవ్వనని చెప్పడంతో.. ఇవ్వలేదు అనే కోపంతోనే ఆ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని పొడిచిన కత్తి మరో ఇంచు లోపలికి దిగితే మాత్రం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి మరింత విషమంగా ఉండేదని, ఆయన గాయాలు చూసిన డాక్టర్లు చెబుతున్నారు.ఏది ఏమైనప్పటికీ సైఫ్ అలీ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా ఆ గాయాల నుండి బయటపడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం కుదుట పడుతుండడంతో ఐసియు నుండి స్పెషల్ రూమ్ లోకి సైఫ్ ని మారుస్తున్నట్ట డాక్టర్ తెలియజేశారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన దొంగలని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో ఇంకా ఎన్ని విషయాలు బయట పడతాయో చూడాలి.