Manoj VS Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జల్‌పల్లిలో ఉన్న నివాసం నుండి మంచు మనోజ్‌ను బయటికి పంపించేయమంటూ కోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. కొడుకుని ఇంటి నుండి పంపించేయడం కోసం మోహన్ బాబు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులు తనకు చెందే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. జల్‌పల్లి నివాసంతో పాటు తన ఆస్తులలో ఉన్న అందరినీ వెకేట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లి లో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని, అందుకే తన ఆస్తులలో ఉన్న వారందరినీ వెంటనే వెకేట్ అవన్నీ తనకు తిరిగి అప్పగించాలని కోరారు.
అప్పటినుండి ఇప్పటివరకు
గత కొన్ని రోజుల నుంచి మోహన్ బాబు తిరుపతి ఇంట్లోనే ఉంటున్నారు, జల్‌పల్లి నివాసంలో మంచు మనోజ్ మాత్రమే ఉంటున్నాడు. మోహన్ బాబు చేసిన ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు. పోలీసులకు దగ్గర నుండి మోహన్ బాబు (Mohan Babu) ఆస్తుల నివేదికను కలెక్టర్ స్వయంగా తీసుకొని పరిశీలిస్తున్నారు. మోహన్ బాబు చెప్పినట్టుగా మంచు మనోజ్ జల్‌పల్లి ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు సిద్ధం చేసినట్టు సమాచారం. మొత్తానికి మంచు ఫ్యామిలీ వివాదం ముందుగా ఆ జల్‌పల్లి నివాసంలోనే మొదలయ్యింది. అక్కడే ముందుగా మంచు మనోజ్‌పై మోహన్ బాబు అనుచరులు దాడి చేశారనే విషయం బయటికొచ్చింది.
వదిలి వెళ్లేది లేదు
మంచు మనోజ్‌పై మోహన్ బాబు, విష్ణు అనుచరులు దాడి చేసినా కూడా తను మాత్రం ఆ ఇంటిని వదిలి వెళ్లనని అప్పుడే చెప్పేశాడు. మీడియా అంతా జల్‌పల్లి నివాసం బయట ఉన్నప్పుడు కూడా మనోజ్.. గేట్లు బద్దలుగొట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అప్పటినుండి ఇప్పటివరకు మంచు మనోజ్ ఆ ఇంటి నుండి బయటికి రాలేదు. తన భార్య పిల్లలతో అక్కడే నివాసముంటున్నాడు. మంచు విష్ణు (Manchu Vishnu) అమెరికా నుండి వచ్చిన తర్వాత కొన్నిరోజుల పాటు మనోజ్, మోహన్ బాబులతో అక్కడే ఉన్నాడు. కానీ ఆ కొన్నిరోజులు అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. మొత్తానికి మంచు మనోజ్ (Manchu Manoj) ఆ ఇంటిని వదిలి వెళ్లడం లేదనే ఉద్దేశ్యంతో మోహన్ బాబే తన మకాంను తిరుపతికి మార్చారు.
Also Read: విష్ణు పర్సనల్ విషయాలు బయటపెడుతున్న మనోజ్..ఇంతకు తెగించారేంట్రా..?
మళ్లీ మొదలు
గత నెలలో జల్‌పల్లి నివాసంలో మంచు ఫ్యామిలీ మధ్య వివాదం చెలరేగిన తర్వాత కొన్నాళ్ల పాటు దీని గురించి అనేక వార్తలు బయటికొచ్చాయి. మధ్యలో గొడవలు కాస్త కుదుటపడ్డాయనే ప్రేక్షకులు అనుకున్నారు. కానీ తాజాగా సంక్రాంతి వేడుకల కోసం తన యూనివర్సిటీకి వెళ్లారు మోహన్ బాబు. అదే సమయంలో మనోజ్ కూడా అక్కడికి రావడంతో మరోసారి ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఇప్పుడు ఏకంగా మంచు మనోజ్‌ను ఇంటి నుండి ఖాళీ చేయించాలంటూ కోర్టును ఆశ్రయించి అందరికీ షాకిచ్చారు మోహన్ బాబు.