E-Paper
Advertisement

Karthi: కార్తీ హిట్ సినిమా సత్యం సుందరం.. ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే.. ?

Karthi: కార్తీ హిట్ సినిమా సత్యం సుందరం.. ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే.. ?
Advertisement

Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో కార్తీ ఒకడు. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇక ఈ మధ్యనే తిరుపతి లడ్డూ వివాదంలో హాట్ టాపిక్ గా మారాడు ఈ హీరో. తాజాగా  కార్తీ నటించిన సత్యం సుందరం సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే.

అరవింద్ స్వామి, కార్తీ ప్రధాన పాత్రల్లో 96 మూవీ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2D ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించారు ఈ సినిమాకు మొదట అంత బజ్ లేదు. సత్యం సుందరం సినిమా రిలీజ్ రోజునే దేవర సినిమా రిలీజ్ అయ్యింది. దీంతో ఎవరు కార్తీ సినిమాను చూస్తారులే అనుకున్నారు. కానీ, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఒక చిన్న డిస్కషన్.. కార్తీ సినిమాపై ఎక్కడలేని బజ్ ను తీసుకొచ్చేలా చేసింది. అదే తిరుపతి లడ్డూ వివాదం.

Advertisement

OG Movie: గూగుల్ సెర్చ్ లో OG కాస్ట్.. అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో.. ?

యాంకర్.. కార్తీని లడ్డూ గురించి అడగడం, కార్తీ అది సెన్సిటివ్ ఇష్యూ అని జోక్ గా చెప్పడం… అది కాస్తా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లడం.. ఆయన కార్తీ.. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. దానికి కార్తీ సైతం పాజిటివ్ గా తీసుకొని.. పవన్ కళ్యాణ్ కు సారీ కూడా చెప్పాడు. ఇక ఈ వివాదంలోకి కార్తీ రావడంతో.. ఆయన సినిమా సత్యం సుందరం హైప్ తెచ్చుకుంది. ఆ హైప్ తో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  కార్తీ, అరవింద్ స్వామి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

Advertisement

ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు  గుడ్ న్యూస్ వచ్చేసింది. అక్టోబర్ 25 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సత్యం సుందరం డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మొదట అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం.. అక్టోబర్ 25 నుంచే అన్ని భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Malaika Arora: బ్రేకప్ తర్వాత తొలిసారి స్పందించిన మలైకా.. లక్కీ పర్సన్ ను అంటూ..!

ఇక సత్యం సుందరం కథ విషయానికొస్తే.. సత్యంకు తన సొంత ఊరు అంటే చాలా ఇష్టం. కానీ, కొన్ని కారణాల వలన ఊరును వదిలేసి వెళ్ళిపోతాడు.  చాలా ఏళ్ల తరువాత తనకు ఎంతో ఇష్టమైన చెల్లి పెళ్లికి అదే ఊరు వెళ్లాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా చెల్లి మాకోసం ఆ ఊరు బయల్దేరతాడు సత్యం. ఇక మధ్యలో అతనికి బంధువు అని చెప్పి సుందరం పరిచయమవుతాడు.

మొదట సుందరం అంటే సత్యం కు ఇష్టంలేకపోయినా.. ఉన్నాకొద్దీ వారి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. చిన్నతనంలోనే విడిపోయిన ఈ దూరపు బంధువుల ప్రయాణం ఎలా సాగింది..? సుందరం రావడంతో సత్యం జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటి.. ? అనేది కథ. బంధాలు, కుటుంబాలు, వారి మధ్య ఉండే ప్రేమలను దర్శకుడు ఎంతో హృద్యంగా చూపించాడు. మరి థియేటర్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి .

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×