BigTV English

Malaika Arora: బ్రేకప్ తర్వాత తొలిసారి స్పందించిన మలైకా.. లక్కీ పర్సన్ ను అంటూ..!

Malaika Arora: బ్రేకప్ తర్వాత తొలిసారి స్పందించిన మలైకా.. లక్కీ పర్సన్ ను అంటూ..!

Malaika Arora.. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) సినిమాల కంటే వ్యక్తిగత కారణాల వల్లే తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతకుముందే తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ (Arjun Kapoor) తో విడిపోయినట్టు వార్తలు రాగా.. మరొకవైపు కన్న తండ్రిని కోల్పోయి మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు ఒకరితో ఒకరు కనిపించే అర్జున్, మలైకా ఈమధ్య విడివిడిగా కనిపించడంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు అనే వార్తలు మరింత బలమయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది మలైకా.


ఆ విషయంలో నేను అదృష్టవంతురాలని..

మలైకా అరోరా మాట్లాడుతూ.. తన జీవితం గురించి, తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చింది. మలైకా అరోరా మాట్లాడుతూ.. జీవితంలో కష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడంలో నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, నా పని కూడా సహాయపడ్డాయి. నా చుట్టూ ఉండే వ్యక్తులు బలంగా ఉండడానికి నాకు ఎంతో సహాయం చేశారు. నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు లేకుండా నేను లేను. ముఖ్యంగా నన్ను వారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంతో మద్దతు ఇస్తారు. స్ఫూర్తిని ఇస్తారు. వాళ్లే నాకు సర్వస్వం అంటూ తన స్నేహితులను, కుటుంబ సభ్యులను తలుచుకొని ఎమోషనల్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే కరీనాకపూర్ (Kareena Kapoor), కరిష్మా కపూర్(Karishma Kapoor)అలాగే అమృత అరోరా(Amritha arora)తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది.


ఎప్పుడూ పశ్చాత్తాపడలేదు..

నేను నా జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. నా వ్యక్తిగత , వృత్తిపరమైన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఈ జీవితంలో నేను తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా నన్ను మరింతగా తీర్చిదిద్దింది. అందుకే ఎటువంటి పశ్చాతాపం లేకుండా జీవిస్తున్నాను. కొన్ని కొన్ని విషయాలలో మారినందుకు నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే మలైకా అరోరా, అర్జున్ కపూర్ 2018 లో డేటింగ్ ప్రారంభించగా.. 2019లో సోషల్ మీడియా ద్వారా తమ బంధాన్ని బహిరంగంగా అంగీకరించారు.కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అర్జున్ కపూర్ తో బ్రేకప్ నిజమేనా..

దీనికి తోడు ఇటీవల అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మలైకా అసలు ఎక్కడ కనిపించలేదు. దీనికి తోడు అతనికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈమె నుంచి ఒక్క పోస్టు కూడా రాకపోవడం, వీరి మధ్య బ్రేకప్ కి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో వీరిద్దరి బ్రేకప్ గురించి ఎవరు ఎంత మాట్లాడుకున్నా.. దీనిపై రియాక్ట్ కాలేదు. దీంతో ఇద్దరూ విడిపోయారని బాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తోంది. అంతేకాకుండా ఫ్యాషన్ షోలో కూడా మలైకా, అర్జున్ ఒకరికొకరు దూరంగా కూర్చోవడం, అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మరోవైపు మలైకా అరోరా తండ్రి మరణించినప్పుడు అర్జున్ కపూర్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇన్ని సంగతుల మధ్య వీరిద్దరూ విడిపోయారా..? లేక కలిసున్నారా ..? అనే విషయాలు మాత్రం అంతు చిక్కడం లేదు. ఏది ఏమైనా వీరిద్దరూ కలవాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు.

Related News

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Big Stories

×