E-Paper
Advertisement

OG Movie: గూగుల్ సెర్చ్ లో OG కాస్ట్.. అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో.. ?

OG Movie: గూగుల్ సెర్చ్ లో OG  కాస్ట్..  అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో.. ?
Advertisement

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో OG  ఒకటి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. విలన్ గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటి నుంచి సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి సగం షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

మధ్యలో పవన్ రాజకీయాలు, ప్రచారాలు అంటూ వెళ్లడంతో OG హోల్డ్ లో పడింది. ఇక పవన్.. ఏపీ డిప్యూటీ సీఎం గా మారడంతో మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా మళ్లీ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ సైతం.. తన మిగతా రెండు సినిమాలను పక్కన పెట్టి.. ముందు OG నే ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట. ఈ మధ్యనే పవన్ OG సెట్ లో అడుగుపెట్టిన విషయం తెల్సిందే. వచ్చే ఏడాది OG థియేటర్ లో రిలీజ్ కానుంది.

Advertisement

Varshini Sounderajan: బ్లూ కలర్ డ్రెస్సులో.. హృదయాలను కొల్లకొడుతున్న వర్షిణి

ఇక ఈ విషయం పక్కన పెడితే.. గత రెండు రోజులుగా OG సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడని. ఏంటి.. నిజమా.. ?అంటే అవును. గూగుల్ తల్లి అలానే చూపించింది మరి. గూగుల్ చూపించడమేంటి అనే డౌట్ వస్తుందా.. ? గూగుల్ లో ఏ ప్రశ్నకు అయినా సమాధానం సెకన్స్ లో దొరుకుతుంది. ఏ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు.. ? ఎప్పుడు రిలీజ్ ఉంటుంది.. ? ఇలాంటి సమాచారం మొత్తం ఉంటుంది.

Advertisement

అలానే OG సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అని గూగుల్ తల్లిని అడిగితే.. షాకింగ్ గా ప్రభాస్ ఫోటో కూడా చూపించడం ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. OG డైరెక్టర్ సుజీత్.. ప్రభాస్ తో సాహో సినిమా చేసిన విషయం తెల్సిందే. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలోనే ఆ సినిమా కూడా నడుస్తుంది. ఇప్పుడు పవన్ నటిస్తున్న OG కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలోనే రావడంతో .. ఈ రెండింటికీ లింక్ ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే OG కాస్ట్ లో ప్రభాస్ ఉన్నట్లు గూగుల్ చూపిస్తుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

Varun Dhawan: సమంతతో నటించొద్దని వార్నింగ్ ఇచ్చారు.. వరుణ్ ధావన్ షాకింగ్ కామెంట్స్

అసలు ప్రభాస్ , పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే ఇండస్ట్రీ షేక్ అవుతుంది. అదే ఒక సినిమాలో వీరిద్దరూ కనిపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, అదే కనుక నిజమైతే.. ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పాలి. ఇక ఈ విషయం తెల్సిన దగ్గరనుంచి ఫ్యాన్స్.. అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో కదా.. అని కామెంట్స్ పెడుతున్నారు. మరి నిజంగా సుజీత్.. సాహో ను కూడా OG లో తీసుకొస్తాడా.. ? లేక ఇది కేవలం రూమర్ గానే  మిగిలిపోతుందా.. ? అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×