E-Paper
Advertisement

Nirupam Paritala: డాక్టర్ బాబు.. కార్తీక దీపం సీరియల్ కు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా.. ?

Nirupam Paritala: డాక్టర్ బాబు.. కార్తీక దీపం సీరియల్ కు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా.. ?
Advertisement

Nirupam Paritala: నిరుపమ్ పరిటాల.. అని చెప్పగానే ఎవరు ఆయన.. కొత్త హీరోనా అనేస్తారు. అదే కార్తీక దీపండాక్టర్ బాబు అని చెప్పండి. హే.. ఏం మాట్లాడుతున్నావ్.. మా డాక్టర్ బాబు మాకు తెలియదా అనేస్తారు. అంతలా ఒరిజినల్ నేమ్ ను కూడా మర్చిపోయి.. సీరియల్స్ పేరుతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు నిరుపమ్. చంద్రముఖి సీరియల్ తో టెలివిజన్ తెరకు పరిచయమైన నిరుపమ్ ఆ తరువాత వరుస సీరియల్స్ తో మెప్పించాడు.

ఇక నిరుపమ్.. అలనాటి సీరియల్ నటుడు ఓంకార్ కుమారుడు అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. తండ్రి పేరును వాడకుండా.. తనకంటూ ఒక సొంత గుర్తింపుతో ఎదిగాడు నిరుపమ్. ఇక ఎన్నో సీరియల్స్ చేసినా రానీ గుర్తింపు.. కార్తీక దీపం సీరియల్ తో వచ్చింది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క అంటే తెలియనివారుండరు. సోషల్ మీడియాలో షేక్ చేసిన సీన్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్తయి. అంతలా ఈ సీరియల్ టాప్ పొజిషన్ కు చేరుకుంది.

Advertisement

కార్తీక దీపం సీరియల్ అతని జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం నిరుపమ్.. కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ లో నటిస్తున్నాడు. తన గుర్తింపుకు తగ్గట్టే రెమ్యూనరేషన్ కూడా ఆ రేంజ్ లోనే అందుకుంటున్నాడట. కార్తీక దీపం.. ఇది నవ వసంతం సీరియల్ కు నిరుపమ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ. 40 వేలు తీసుకుంటున్నాడట. అంతకుముందు వరకు ఎపిసోడ్ కు రూ. 22 వేలు తీసుకొనే ఈ నటుడు రేంజ్ మారడంతో పారితోషికం కూడా డబుల్ చేసినట్లు సమాచారం.

ఇక కేవలం ఈ సీరియల్స్ మాత్రమే కాకుండా ఈ మధ్య సినిమాల్లో కూడా మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు. గతేడాది అమెజాన్ లో రిలీజ్ అయిన  కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ సరసం నటించే ఛాన్స్ పట్టేశాడు. ఈ సిరీస్ మొదటి సీజన్ పూర్తి కాగా.. త్వరలోనే రెండో సీజన్ మొదలుకానుంది. మరి ఈ సిరీస్ తో నిరుపమ్ .. హీరోగా మారతాడేమో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×