BigTV English

Kate Winslet: ఆ కోరికలతో రగిలిపోవాలంటే ఇలా చెయ్యండి.. ‘టైటానిక్’ భామ ఘాటు వ్యాఖ్యలు, 48 ఏళ్ల వయస్సులోనూ..

Kate Winslet: ఆ కోరికలతో రగిలిపోవాలంటే ఇలా చెయ్యండి.. ‘టైటానిక్’ భామ ఘాటు వ్యాఖ్యలు, 48 ఏళ్ల వయస్సులోనూ..

Kate Winslet: కేట్ విన్స్‌లెట్ పేరు చెప్తే వెంటనే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ ‘టైటానిక్’ మూవీలో రోజ్ అంటే మాత్రం చాలామంది గుర్తుపడతారు. ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘టైటానిక్’లో హీరోయిన్‌గా నటించిన నటి కేట్ విన్స్‌లెట్. తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి ఒక విషయం బయటపెట్టి హాట్ టాపిక్‌గా మారింది కేట్. తనకు ప్రస్తుతం 48 ఏళ్లు. అయితే, ఒకప్పుడు ఆమె తన లైంగిక జీవితం కోసం డాక్టర్లను కలిశానని, థెరపీకి వెళ్లానని, సర్జరీ కూడా చేయించుకున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అలాంటి సమస్యలు ఉన్నవారికి సలహాలు కూడా ఇచ్చింది.


కోరికలు అంతం

ఇటీవల కేట్ విన్స్‌లెట్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన సెక్స్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. దీంతో తను కూడా ఓపెన్‌గా వాటి గురించి మాట్లాడడంతో పాటు లైంగిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నవారికి సలహాలు కూడా ఇచ్చింది. ‘‘థైరాయిడ్ వల్ల బాధపడుతున్న మహిళల్లో లైంగిక కోరికలు తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల కూడా అలాంటి కోరికలు తగ్గుతాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహిళల శరీరంలో కూడా టెస్టోస్టెరాన్ ఉంటుంది. అది అయిపోయి, ఎగ్స్ అనేవి లేకుండా పోతే పూర్తిగా లైంగిక కోరికలు అనేవి అంతమయిపోతాయి’’ అని చెప్పుకొచ్చింది కేట్.


Also Read: రూ.500 కోట్లతో సినిమా చేస్తున్నారు.. వరద బాధితులకు ఒక్క రూపాయ్ కూడా ఇవ్వని మంచు ఫ్యామిలీ

సర్జరీ సాధ్యం

‘‘ఒక్కసారి శరీరంలో టెస్టోస్టెరాన్ అయిపోతే మళ్లీ దానిని మళ్లీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ పద్ధతుల ద్వారా అలా చేయడం సాధ్యమే. మళ్లీ మీలో కోరికలు కలుగుతాయి. అదెలా ఉంటుందో నాకు తెలుసు’’ అంటూ తన పర్సనల్ లైఫ్ గురించి ఏ మాత్రం మోహమాటం లేకుండా మాట్లాడింది కేట్ విన్స్‌లెట్. ఇంతకు ముందు కూడా తను మహిళలకు సంబంధించిన పలు విషయాల గురించి ఓపెన్‌గానే చర్చించింది. బాడీ షేమింగ్ గురించి కూడా చాలామంది ఇన్‌స్పైర్ చేసేలా మాట్లాడింది కేట్ విన్స్‌లెట్. ఇక తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా మహిళల శరీరాల్లో వచ్చే పలు మార్పుల గురించి అవగాహన కలిగేలా చేసింది.

మహిళల శరీరాలు అంతే

‘‘కోరికలు తగ్గిపోవడం అనేది మహిళల తప్పు కాదు. మన శరీరాలు కాస్త వింతంగా ఉంటాయి. పలు విధాలుగా ప్రవర్తిస్తుంటాయి. ముఖ్యంగా మన వయసు పెరుగుతున్నకొద్దీ శరీరంలో మార్పులు కూడా చాలా వస్తాయి. మీకు శారీరకంగా పార్ట్‌నర్‌తో కలవాలనే ఆశ ఉన్నా అలా కలుస్తున్న సమయంలో మీ పార్ట్‌నర్‌కు తృప్తి కలగకపోవచ్చు. కాబట్టి నేనైతే కచ్చితంగా టెస్టోస్టెరీన్ రీప్లేస్ సర్జరీని ఎన్నుకుంటాను’’ అని ఓపెన్‌గా చెప్పేసింది కేట్ విన్స్‌లెట్. ‘‘మహిళల్లో వయసు పెరుగుతున్నకొద్దీ కోరికలు తగ్గిపోతాయి, ఛాతిలో మార్పులు వస్తాయి, చర్మం మారిపోతుంది. అయితే ఏంటి? మనం అలా క్రియేట్ చేయబడ్డాం. అయినా వయసు పెరుగుతున్నకొద్దీ మహిళలు మరింత సెక్సీగా అవుతారు. నేను నా ఫ్రెండ్స్‌కు కూడా వారు సెక్సీగా ఉన్న విషయం గుర్తుచేస్తుంటాను’’ అని తెలిపింది కేట్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×