BigTV English

Pawan Kalyan: వామ్మో రాజకీయాలలోనూ పవన్ కళ్యాణ్ ప్రపంచ రికార్డు ను సొంతం చేసుకున్నారుగా? దటీజ్ పవర్ స్టార్

Pawan Kalyan: వామ్మో రాజకీయాలలోనూ పవన్ కళ్యాణ్ ప్రపంచ రికార్డు ను సొంతం చేసుకున్నారుగా? దటీజ్ పవర్ స్టార్

Pawan Kalyan Recieves World Record Award for Conducting Gram Sabhas in AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు. మిస్టర్ పర్ ఫెక్ట్ అనే పదం ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ప్రచారం కోసం పాకులాడరు..పదవుల కోసం వెంటపడరు. ఇవే ఆయనను ప్రస్తుతం ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్ పవన్ కళ్యాణ్ పదవిలోకి వచ్చి వంద రోజులు కావస్తోంది. అయితే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారు. దానిపై ప్రత్యర్థులు ట్రోలింగ్స్ కూడా చేశారు. మొన్నటి బుడమేరు వరదలలో కూడా చంద్రబాబు వారంరోజుల పాటు అక్కడే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండి అ ధికారులతో చురుకుగా పాల్గొన్నారు. అయితే లోకేష్ కూడా మంగళగిరి పర్యటించి వరద ప్రాంతాల బాధితులను కలుసుకుని వారికి భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అందరూ వ్యాఖ్యానించారు. అందుకు సమాధానంగా పవన్ తనని జనం ఇంకా సినిమా సెలబ్రిటీగానే చూస్తున్నారని..అందుకే బాధితులను పరామర్శించడానికి వెళితే పెద్ద ఎత్తున జనం తనని చూసేందుకు వస్తారని..అప్పుడు తొక్కిసలాట జరిగి ఏదైనా విపత్తు జరిగితే అందుకు తానే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు.


స్వర్ణ గ్రామ పంచాయతీ

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ జనం గురించే ఆలోచిస్తారు కాబట్టే జనానికి ఇబ్బందులు కలిగించే పనులు చేయరని అభిమానులు తమ అభిమాన హీరోని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే పవన్ కళ్యాణ్ తన శాఖకు న్యాయం చేయాలని భావించారు. ఇప్పటిదాకా పవన్ ఏమీ చేయడం లేదనే నోళ్లు మూయించారు గత నెల 23వ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


Also Read:  పెద్ద ప్లానింగే.. అందుకేనా శ్యామలకు ఆ పదవి, ఉచ్చులో చిక్కుకుంటారు జాగ్రత్త!

గ్రామసభలు

ఒకే రోజు 13 వేల 326 పంచాయతీలలో ఒక రోజు గ్రామ సభలు నిర్వహించారు. అంతేకాదు ఆ ఒక్క రోజే రూ.4500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు సంబంధించిన తీర్మానాలు కూడా చేశారు. ఇది ఏకంగా ప్రపంచ రికార్డుగా గుర్తింపు పొందింది.ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం చూసి వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించి తమ రికార్డులలో పవన్ కళ్యాణ్ గ్రామసభల నిర్వహణను నమోదు చేసింది. దీనితో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ స్పందించి పవన్ కళ్యాణ్ కు ప్రశంసా పత్రం, వరల్డ్ రికార్డ్ మెడల్ ని పవన్ కు అందజేశారు. హైదరాబాద్ పవన్ కళ్యాణ్ నివాసంలో ఇందుకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీప్ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ కమిషనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చంద్రబాబుకు కృతజ్ణతలు

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తనకు ఈ శాఖను ఎంతో నమ్మకంగా అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ణతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అవార్డుల కోసమో, రికార్డుల కోసమో తాను ఈ పని చేయలేదని..ఇకపై గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తన వంతు కర్తవ్యంగా సేవ చేస్తానని..గ్రామాలే దేశ ప్రగతికి పట్టుగొమ్మలని అన్నారు.

Related News

Free Electricity In AP: తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. వారందరికీ ఉచిత విద్యుత్

Smart Ration cards: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ

Jagan Tour: జగన్ తిరుమల పర్యటన.. మళ్లీ డిక్లరేషన్ లొల్లి, నో అంటున్న వైసీపీ

AP DSC verification: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్‌ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక

AP New Scheme: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, వారంతా ఆనందంలో

CM Progress Report: 51వ CRDA సమావేశం.. అమరావతి డెవలప్‌మెంట్‌కు ఎన్ని కోట్లు అంటే..!

Big Stories

×