BigTV English

Keeda Cola Movie : ‘కీడా కోలా’ నటుడి హఠాన్మరణం.. రియాక్ట్ అయిన దర్శకుడు..

Keeda Cola Movie : ‘కీడా కోలా’ నటుడి హఠాన్మరణం.. రియాక్ట్ అయిన దర్శకుడు..
Keeda Cola Movie 


Keeda Cola Movie  : మరణం అనేది ఎప్పుడు, ఎవరికి, ఎలా సంభవిస్తుందో చెప్పడం కష్టం. ఒకప్పుడు ఎవరో ఒకరు వయసు అయిపోయిన వారికి హార్ట్ ఎటాక్ లాంటిది వచ్చి మరణించేవారు. కానీ ఇప్పుడు కాలేజీకి వెళ్లే విద్యార్థుల దగ్గర నుండి ఉద్యోగం చేసే యూత్ వరకు అందరినీ హార్ట్ ఎటాక్ చంపేస్తోంది. తాజాగా ఎన్నో ఆశలతో ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వచ్చిన ఒక నటుడు కూడా గుండెపోటుతో మరణించాడు. దీనిపై పలువురు సినీ సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు.

ముందుగా థియేటర్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు హరికాంత్. మెల్లగా సినిమాల్లోకి రావాలనుకున్నాడు. పెళ్లిచూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘కీడా కోలా’లో అవకాశం వచ్చింది. ఏదో చిన్న పాత్ర లాంటి అవకాశం కాదు.. టీజర్‌లో కూడా కనిపించేంత కీలక పాత్రే వచ్చింది. దీంతో సినిమాల్లో కూడా అడుగుపెట్టాలనుకునే తన కల నిజమయ్యింది. కానీ తన కలను స్క్రీన్‌పై చూసుకోకముందే కన్నుమూశాడు హరికాంత్.


తరుణ్ భాస్కర్ ఒక సినిమాను డైరెక్ట్ చేసి అయిదేళ్లు దాటిపోయింది. దీంతో తను మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు డైరెక్ట్ చేస్తాడా అని యూత్ అంతా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం కీడా కోలా అనే కొత్త మూవీతో ముందుకొస్తున్నట్టు తరుణ్ అనౌన్స్ చేశాడు. అంతే కాకుండా ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశాడు. ఈ టీజర్ చూస్తుంటే.. కీడా కోలా అనేది క్రైమ్ కామెడీ అని అర్థమవుతోంది. కీడా కోలా టీజర్‌లో గన్ పట్టుకొని హరికాంత్ కనిపించాడు. ఇప్పుడు తన హఠాన్మరణం చెందడం నమ్మలేకపోతున్నానంటూ తరుణ్ పోస్ట్ పెట్టాడు.

‘ఈ వార్త వినగానే షాక్ అయ్యాను, ఎంతో బాధపడ్డాను. హరి.. ఎన్నో ఏళ్లుగా థియేటర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ.. సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మేము తనని ఆడిషన్ చేసినప్పుడే అర్థమయ్యింది అతడు దీనికి కరెక్ట్ అని. సెట్‌లో ఎంత ఇబ్బందులు ఉన్నా అన్ని భరించాడు. తనకు వీలైనంతగా ప్రతీ పనిలో మాకు సాయం చేశాడు. తను పోషించే పాత్ర మా క్లైమాక్స్‌కు ప్రాణం పోసింది. నిన్ననే మా టీమ్‌కు ఫోన్ చేసి వర్క్ గురించి కనుక్కున్నాడు. జీవితాన్ని అంచనా వేయలేము అనడానికి ఇది మరొక ఉదాహరణ’ అంటూ హరి మరణం గురించి పోస్ట్ చేశాడు తరుణ్ భాస్కర్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×