E-Paper
Advertisement

Keeda Cola Movie Updates : ‘కీడా కోలా’ టీజర్ ఔట్.. క్రైమ్‌తో తరుణ్ భాస్కర్ కామెడీ..

Keeda Cola Movie Updates : ‘కీడా కోలా’ టీజర్ ఔట్.. క్రైమ్‌తో తరుణ్ భాస్కర్ కామెడీ..
Advertisement
Keeda Cola Movie Updates

Keeda Cola Movie Updates : ఈరోజుల్లో సీనియర్ డైరెక్టర్ల కంటే యంగ్ డైరెక్టర్లకే ఎక్కువ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఈతరం వారికి నచ్చేటట్టుగా యంగ్ డైరెక్టర్లు తెరకెక్కిస్తున్న సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అందుకే సీనియర్ హీరోలు సైతం యంగ్ డైరెక్టర్లతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్‌లోని అలాంటి యంగ్ డైరెక్టర్లలో ఒకరు తరుణ్ భాస్కర్. యూత్ అంతా ఎంతో ఆసక్తికరంగా చూస్తున్న తరుణ్ భాస్కర్ మూడో చిత్రం టీజర్ తాజాగా విడుదలయ్యింది.

Advertisement

తరుణ్ భాస్కర్.. దర్శకుడిగా తను తెరకెక్కించింది రెండు సినిమాలే. కానీ యూత్‌లో తనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దర్శకుడిగా తరుణ్ తెరకెక్కించిన చివరి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ సినిమా విడుదలయ్యి అయిదేళ్లు కావస్తున్నా.. ఇంకా తను డైరెక్ట్ చేస్తున్న తరువాతి చిత్రంపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ అంతా తనపై కోపంగా ఉన్నారు. అయినా అదంతా ఫన్నీగానే తీసుకునేవాడు తరుణ్. ఫైనల్‌గా ఇప్పటికి తన మూడో చిత్రం ‘కీడా కోలా’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘కీడా కోలా’ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుండి దానికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది చిత్రం విడుదలయ్యి అయిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కీడా కోలా టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పగానే ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అయిపోయారు. ఇక టీజర్ విడుదలకు వారం రోజుల ముందు నుండే క్యారెక్టర్స్‌ను రివీల్ చేస్తూ వస్తున్నాడు ఈ యూత్‌ఫుల్ డైరెక్టర్.

Advertisement

చాలాకాలం తర్వాత సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కీడా కోలాలో తాత క్యారెక్టర్‌తో బ్రహ్మానందం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తనతో పాటు తరుణ్ భాస్కర్‌తో ఇంతకు ముందు కలిసి పనిచేసిన చాలామంది నటులు ఇందులో ఉన్నారు. టీజర్‌లో పెద్దగా డైలాగులు లేకపోయినా.. దీనిని చూస్తుంటే క్రైమ్ కామెడీ జోనర్‌కు చెందిందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో ఫుల్ ఖుష్‌తో ఉన్న తరుణ్ భాస్కర్‌కు కీడా కోలా టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ డబుల్ హ్యాపినెస్‌ను అందిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×