BigTV English

RRR: రిచర్డ్ ప్రశంసలు.. కీరవాణి కన్నీళ్లు.. రాజమౌళి ఎమోషనల్..

RRR: రిచర్డ్ ప్రశంసలు.. కీరవాణి కన్నీళ్లు.. రాజమౌళి ఎమోషనల్..

RRR: నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్. కీరవాణి, చంద్రబోస్‌లకి అవార్డ్. ఆస్కార్ అవార్డ్ అందుకోగానే చాలామంది ఎమోషనల్ అవుతుంటారు. వేదికపైనే ఏడ్చేస్తారు. ఆనంద భాష్పాలు కారుస్తారు. కానీ, మన కీరవాణి కంట నీటిచుక్క కూడా కనబడలేదు. ఆస్కార్‌ను తెగ ఎంజాయ్ చేశారు. అవార్డు అందుకున్నాక కీరవాణి ఓ పాట పాడారు. ‘టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌..’ అనే ఫేమస్ ఇంగ్లీష్ సాంగ్‌ను పేరడి చేసి ఆర్ఆర్ఆర్, రాజమౌళిలను పొగిడేశారు. ఆ సాంగ్ హాలీవుడ్‌ను టచ్ చేసింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి రియాక్షన్ వచ్చింది.


ఆస్కార్ అవార్డు తీసుకున్న తర్వాత కీరవాణి పాడిన సాంగ్.. హాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్. ఆ సాంగ్‌ను ట్యూన్ చేసింది దిగ్గజ మ్యూజిషియన్ రిచర్డ్ కార్పెంటర్. తాను ఆయన పాటలు వింటూ పెరిగానంటూ అవార్డు తీసుకున్నాక కీరవాణి అన్నారు. ఈ విషయం తెలిసి రిచర్డ్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆస్కార్ వేదికపై తన పాటను పాడినందుకు ఫుల్ ఫిదా అయ్యారు. కీరవాణి, చంద్రబోస్‌కు విషెష్ తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

రిచర్డ్ కార్పెంటర్ తన కూతుర్లతో కలిసి ‘టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌…’ పాటను పాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి కంగ్రాట్స్‌ చెప్పారు. ఆ పోస్ట్‌పై కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు. కార్పెంటర్‌ పోస్ట్‌ చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయని అన్నారు.


రిచర్డ్ విషెష్‌పై దర్శకుడు రాజమౌళి సైతం స్పందించారు. రిచర్డ్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో తన సోదరుడు కీరవాణి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. ఆస్కార్‌ క్యాంపెయిన్‌ మొత్తం కీరవాణి ప్రశాంతంగా ఉన్నారని.. ఆస్కార్‌ గెలుపొందడానికి ముందు, ఆ తర్వాత కూడా ఏ విధమైన ఉద్వేగాన్నీ బయటపెట్టలేదని రాజమౌళి అన్నారు. కానీ, రిచర్డ్ పోస్ట్‌ చూశాక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని.. మా కుటుంబానికి ఇదొక మధురానుభూతి అని రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×