E-Paper
Advertisement

Keerthi Bhatt: శరీరం మీద ఎక్కడెక్కడో తాకేవారు.. దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను

Keerthi Bhatt: శరీరం మీద ఎక్కడెక్కడో తాకేవారు.. దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను
Advertisement

Keerthi Bhatt: సీరియల్ నటి కీర్తి భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనసిచ్చి చూడు అనే సీరియల్ ద్వారా ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సీరియల్ కీర్తికి మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ఇక ఆమె గతం గురించి తెలిసి .. తెలుగు ప్రేక్షకులు కీర్తిని అక్కున చేర్చుకున్నారు. ఒక ప్రమాదంలో ఆమె తన కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుంది. ఒంటరిగా నిలబడి పోరాటం చేసింది. ఎంతో కస్టపడి ఇండస్ట్రీకి వచ్చింది.

ఇక బిగ్ బాస్ కు వెళ్ళివచ్చాక అందరికి మరింత దగ్గరయింది. ఈ మధ్యనే కీర్తి.. తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఇక ఆమె గతంలో ఎదుర్కున్న పరిస్థితిలు వింటే ఎవరికైన కన్నీరు రాకమానదు. తాజాగా కీర్తి ఒక ఇంటర్వ్యూలో యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాక తన జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను పంచుకుంది.

Advertisement

“రోడ్డు ప్రమాదంలో నా కుటుంబం మొత్తం చనిపోయింది. నేను ఒక్కదాన్నే కోమాలో ఉన్నాను. వెంటనే నన్ను మంగుళూరుకు షిఫ్ట్ చేసారు. అక్కడ 35 రోజులు ఉన్నాను. ఆ సమయంలో నేను ఎంతో నరకం అనుభవించాను. నా శరీరాన్ని ఎవరెవరో ఎక్కడెక్కడో తాకేవారు. వద్దు అని చెప్పాలని ఉన్నా.. శరీరం సహకరించలేదు. నేను కోమాలో నుంచి బయటకు వచ్చాకా ఎవరికి చెప్పకుండా అక్కడనుంచి వచ్చేసాను. నాకు అసలు ఏమి తెలిసేది కాదు. ఎక్కడికి వెళ్ళాలి అన్నా డబ్బు కావాల్సి వచ్చేది. ఒకరోజు రాత్రి ఆటో వాళ్ల దగ్గరకు వెళ్తే.. రూ. 200 ఇస్తా.. వస్తావా అని అడిగారు. నేను కూడా వస్తా అని చెప్పేదాన్ని. ఆ తరువాత వాళ్ల బిహేవియర్ చూసి నాకు అర్ధమయ్యేది.. ఇలా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×