Big Stories

RPF Recruitment 2024: రైల్వేలో 4,660 పోలీసు ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా మరీ!

RPF Recruitment 2024: పదోతరగతి, డిగ్రీ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఇటీవలే రైల్వే శాఖ వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్ఫీఎఫ్ లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. మరి ఇంకెందుకు ఆలస్యం రండి.. ఆ నోటిఫికేషన్ కు సంబంధించి లాస్ట్ డేట్, విద్యార్హత, ఫీజు మొదలైన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

- Advertisement -

కేంద్ర రైల్వే శాఖ ఆర్ఫీఎఫ్ లో 4,660 కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 4,208 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 452 ఎస్సై ఉద్యోగాల ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటికోసం రైల్వే శాఖ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది.

- Advertisement -

మొత్తం పోస్టుల సంఖ్య
కానిస్టేబుల్- 4,208
ఎస్సై-452

Also Read: TSPSP Group 1: ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. టీఎస్‌పీఎస్పీ నిర్ణయం

విద్యార్హతలు..
కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు.. కనీసం పదోతరగతి పూర్తి చేసి ఉండాలి.
ఎస్సై పోస్టులకు దరఖాస్చు చేయాలనుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి..
ఎస్సై పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..
2024 ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా.. మే 15వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. దాదాపు 30 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

Also Read: CMSS Recruitment 2024: CMSSలో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్ష జీతం.. పూర్తి వివరాలివే..!

దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఫీజుగా రూ.500 చెల్లించారు. మహిళలు, ఎక్స్- సర్వీస్మెన్, ఈబీసీ, ఎస్సీ, ఎస్సీలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థులకు ఆన్ లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను వారికి వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి రైల్వే శాఖ ఎంపిక చేస్తుంది.

Also Read: SSC CHSL Notification 2024: SSC భారీ నోటిఫికేషన్.. ఇంటర్ అర్హతతో 3,712 పోస్టులు.. అప్లై చేశారా..!

జీతభత్యాలు..
కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 జీతం ఇస్తారు. ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం అందిస్తారు.

ఈ పోస్టులకు సంబంధించి మరిన్న వివరాలు కోసం, దరఖాస్తు ప్రక్రియ కోసం అభ్యర్ధులు https://rpf.indianrailways.gov.in/RPF/ వైబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News