AI: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసిన ఏఐ.. ఏఐ.. ఏఐ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తోంది. రోజుకో విధంగా అభివృద్ది చెందుతోంది. ఏఐ మోడల్స్ రోజురోజుకు పవర్‌ఫుల్ తయారువుతున్నాయి. మనుషులు గంటలు, రోజులు, నెలలు చేసే పనిని.. ఏఐ చిటికెలో చేసి పడేస్తోంది. యూట్యూబ్‌లో వీడియో క్రియేషన్ నుంచి పెద్దపెద్ద కంపెనీల వరకు ఏఐని ఏదో ఓ రకంగా గట్టిగనే వాడుతున్నారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాన్నాయనే వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. చాట్ జీపీటీ, పాలీ, వైస్ లీ, పాప్ ఏఐ, లుమా ఏఐ, ట్రికిల్, డూరబుల్, 3డీ డైలీ, గీతా జీపీటీగ వంటి ఏఐ టూల్స్ యువత, పలు సంస్థలు ఎక్కువగా వాడుతున్నాయి. అయితే ఏఐతో ఉద్యోగాల పోవడం కంటే.. దాని వల్ల జరిగే దుర్వినియోగం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు ప్రముఖ డీప్ మైండ్ కంపెనీ సీఈఓ డెమిస్ హస్సాబిస్.
ఏఐ ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని..టెక్ ప్రపంచంలో అయతే సంచలనాలే సృష్టిస్తోందని ఆయన చెప్పారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోవడం కంటే దాని దుర్వినియోగమే అత్యంత మోస్ట్ డేంజర్ అని ఆయన అన్నారు. అర్టిఫిషీయల్ ఇంటెలిజన్స్ దుర్వినియోగంపై డెమిస్ ఆందోళన వ్యక్తం చేశాంరు. మనుషుల ఉద్యోగాలను పోతాయనే ఆందోళన తనకు కలిగించడ లేదని.. ఈ ఏఐ చెడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తేనే డేంజర్ అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఏఐని చెడుకు ఎక్కువగా వాడితే.. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అలాంటి వారికి వీటి యాక్సెస్ ఇవ్వకూడదని వివరించారు.
ALSO READ: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో జాబ్స్.. నేడే లాస్ట్ డేట్
పవర్ ఫుల్ ఏఐని ఉపయోగించి అద్భుతమైన పనులను సజావుగా నిర్వహించవచ్చని ఆయన చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వైట్ కాలర్ ఉద్యోగాలు పోయే ప్రమాదముందని డెమిస్ అన్నారు. సాధారణ పనులను ఏఐ చేయడంతో.. మనుషులు మరింత ముఖ్యమైన పనులపై ఇంట్రెస్ట్ పెట్టొచ్చని చెప్పారు. అలాంటప్పుడు మరింత స్కిల్ తో కూడిన ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. ఏఐ ను బ్యాడ్ గా వాడేవారిని గుర్తుపట్టి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ, ఉద్రిక్తతలు ఉన్నప్పటకీ.. ఏఐ పవర్, వాడకం పెరిగే కొద్ది దాని దుర్వినియోగం ఆపేందుకు ప్రపంచ వ్యాప్తంగా సహకారం అవసరమని చెప్పారు.
ALSO READ: యూపీఎస్సీలో 493 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఇంకా వారమే ఛాన్స్
మొత్తానికి.. ఏఐని ముఖ్యమని పనులకే వాడాలని ప్రముఖ నిపుణులు చెబుతున్నారు. ఏఐని దుర్వినియోగానికి వాడితే.. అది మనుషులకు ప్రమాదమని అంటున్నారు. వీలైనంత వరకు వర్క్ విషయంలోనే ఏఐని వాడాలి. ఏఐని అతిగా వాడిని అనర్ధాలు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు. రోబో సినిమా వలే.. చిట్టిని అభివృద్ధి కోసం క్రియేట్ చేస్తే.. అది దుర్వినియోగం అయిందని.. ఏఐని కూడా అలా చేయకూడదని ప్రముఖులు సూచిస్తున్నారు.