BigTV English
Advertisement

Kingdom YouTube Teaser: విడుదలకు ముందే సెన్సేషన్.. యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్..!

Kingdom YouTube Teaser: విడుదలకు ముందే సెన్సేషన్.. యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్..!

Kingdom YouTube Teaser:నాని (Nani ) హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈయన ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు. ఇక తర్వాత గీత గోవిందం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన, పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసి భారీ నష్టాన్ని చవిచూశారు. ఇక ఇప్పుడు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gautham Thinnanuri) దర్శకత్వంలో ‘కింగ్ డమ్'(Kingdom ) అనే చిత్రం చేస్తున్నారు విజయ్ దేవరకొండ. నిన్న అనగా ఫిబ్రవరి 12వ తేదీన ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించి టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.


పాన్ ఇండియా గా విజయ్ దేవరకొండ కింగ్ డమ్..

టీజర్ ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేయగా.. తెలుగు వెర్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), తమిళ్ వెర్షన్ కి సూర్య (Suriya), హిందీ వర్షన్ కి రణబీర్ కపూర్ (Ranbir Kapoor) వాయిస్ ఓవర్ అందించారు. ఇక తెలుగులో విడుదలైన ఈ టీజర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మరింత ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాతో గతంలో ఎన్నడూ నటించని పాత్రలో విజయ్ దేవరకొండ ఆడియన్స్ ను పలకరించనున్నారు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఇంట్రడక్షన్ తో ఈ కింగ్ డమ్ సినిమా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా విడుదలకు ముందే ఈ సినిమా యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.


యూట్యూబ్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న కింగ్ డమ్ టీజర్..

నిన్న యూట్యూబ్లో విడుదలవగా మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 11 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టింది. ఎన్టీఆర్ వాయిస్, విజయ్ దేవరకొండ యాక్షన్, అనిరుద్ మ్యూజిక్ అన్ని బాగా సెట్ అయ్యాయి. “అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా” అని విజయ్ చెప్పిన డైలాగు టీజర్ కి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య రాబోతున్న కింగ్ డమ్ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

కింగ్ డమ్ సినిమా తారాగణం..

ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ , త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్లో రాబోతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జత కట్టనున్నట్లు సమాచారం. ఇదివరకే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×