Minister Ponnam on Brs: తెలంగాణలో అధికార-విపక్షాల మధ్య కులగణన సర్వేపై మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. విపక్ష నేతలు ఆరోపిస్తున్నట్లుగా కులగణనపై తాము చేస్తున్నది రీసర్వే కాదని కుండబద్దలు కొట్టేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు రోల్ మాడల్‌గా,మార్గదర్శకంగా సమగ్ర కుటుంబ సర్వే నిలిచిందన్నారు.
కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేక పోవడంతో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి గడువు ఇచ్చినట్టు చెప్పారు. ఈ క్రమంలో 3 శాతానికి పైగా ప్రజలు తమ సమాచారాన్ని ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దాని తర్వాత మార్చి మొదటివారంలో కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
దీనిపై బీఅర్ఎస్ నేతలు మాట్లాడినట్లుగా ఇదేమీ రీసర్వే కాదన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌కై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని మనసులోని మాట బయటపెట్టారు.
బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం సర్వే పాల్గొనకుండా ఆపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు సదరు మంత్రి. కులగణనపై రీసర్వే చేస్తే తాము పాల్గొంటామని కేటీఆర్ చెప్పిన మాటలను ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ అగ్ర నాయకులు సర్వేలో పాల్గొని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేని బీఆర్ఎస్ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం.
కారు పార్టీలో మూడు పదవులు బీసీకి కేటాయించే విధంగా ఎమ్మెల్సీ కవిత చర్యలు తీసుకోవాలన్నారు. కవితక్క మూడు పదవులను బీసీలకు కేటాయించేలా కరీంనగర్ నుండే ఉద్యమం చేస్తే బాగుంటుందని వెల్లడించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన మీద దుష్ప్రాచారం చేయాలని విపక్షాలు చూస్తున్నాయని మండపడ్డారు.
ALSO READ: చార్జీలను పెంచే యోచనలో హైదరాబాద్ మెట్రో.. పెంపు అవే కారణాలు?
బీజేపీ వ్యాపారస్తుల పార్టీ, కులగణన, బీసీ, ఎస్సి రిజర్వేషన్లు జరగడం వారికి ఇష్టం లేదని చురక వేశారు మంత్రి పొన్నం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సర్వే తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే శాసనసభ ఈ బిల్లును అడ్డుకోవద్దని సూచన చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్.. దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ అమలు చేసే విధంగా కృషి చేయాలన్నారు. సింపుల్ గా చెప్పాలంటే చరిత్రలో సామాజిక మార్పు కలిగించే నిర్ణయం ఇదేనని అన్నారు మంత్రి. ప్రజాస్వామ్యం మీద మీకు విశ్వాసం ఉంటే కచ్చితంగా సర్వేలో పాల్గొనాలని అన్నారు.
రాజకీయ విమర్శల కోసమే బీసీ, ముస్లింల మీద విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు, ముస్లింలో పేద ప్రజలు చాన్నాళ్ల నుంచి బీసీల్లో ఉన్న విషయం మీకు తెలీదుగా అంటూ ప్రశ్నించారు మంత్రి పొన్నం. రేవంత్ సర్కార్ గడువు ఇచ్చిన నేపథ్యంలో విపక్షాలకు చెందిన కీలక నేతలు ఈ సర్వేలో పాల్గొంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం నిర్ణయంపై కారు పార్టీ పెద్దల నుంచి ఎలాంటి సంకేతాలు వస్తాయో చూడాలి.
దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే: మంత్రి పొన్నం
ఇది రీ సర్వే కాదు.. కొంత మంది తమ సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నెల 28 వరకు మరోసారి గడువు ఇచ్చాం
స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తాం
ప్రజల అకాంక్షలకు అనుగుణంగా… pic.twitter.com/En6eXZ9wUf
— BIG TV Breaking News (@bigtvtelugu) February 13, 2025