EPAPER

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Kiran Abbavaram KA movie : షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి రాజావారు రాణి గారు (Rajavaru Ranigaru) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతోనే రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఒకపక్క హీరోకి మరోపక్క దర్శకుడికి విపరీతమైన పేరును తీసుకొచ్చింది. ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్ కోలా విజయ్ దేవరకొండతో సినిమాను చేస్తున్నాడు. రాజావారు రాణి గారు సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన సినిమా ఎస్ ఆర్ కళ్యాణ మండపం (Sr Kalyanamandapam). ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. కరోనా వేవ్ తగ్గిన తర్వాత అప్పుడప్పుడే థియేటర్స్ ఓపెన్ అయ్యాయి ఆ టైంలో ఈ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అయింది. చాలామంది ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఒక నటుడుగానే కాకుండా రచయితగా కూడా ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు కిరణ్.


ఇండస్ట్రీలో జరిగే పోకడల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా హిట్టు పడింది అని అంటే అవకాశాలు వరుసగా వస్తుంటాయి. అదే సినిమా డిజాస్టర్ పడితే వచ్చిన అవకాశాలు కూడా వెళ్ళిపోతుంటాయి. ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా తర్వాత కిరణ్ కి విపరీతంగా అవకాశాలు వచ్చాయి. గీత ఆర్ట్స్, మెగా సూర్య ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. అయితే కిరణ్ వచ్చిన ప్రతి అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు. కానీ క్వాంటిటీలో పడి క్వాలిటీని పక్కన పెట్టేసాడు. కిరణ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా సరైన రిజల్ట్ ఒక సినిమా కూడా తీసుకురాలేకపోయింది. ఇక వరుసగా కిరణ్ సినిమాలు వస్తుండడంతో ఆడియన్స్ కూడా ఒకే మాదిరిగా అనిపించి బోర్ కొట్టేసాడు కిరణ్. లుక్స్ విషయంలో కూడా అన్నిట్లో ఒకేలా ఉండడంతో ఏది సరిగ్గా వర్కౌట్ కాలేదు.

ఇక ప్రస్తుతం వరుస సినిమాల నుంచి కొంత మేరకు గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా “క”. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది అంచనా వేస్తున్నారు. ఇక రిలీజ్ టైం దగ్గర పడటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగచైతన్య చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇకపోతే ఈ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడిన మాటలు చాలావరకు సింపతీ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. కిరణ్ ప్రస్తావించిన కొన్ని విషయాలు ఆలోచించేలా కూడా అనిపించాయి. వేరే సినిమాలో తన పేరు పెట్టి మరి ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది.? అంటూ ఒక ప్రముఖ యూట్యూబ్ అండ్ సినిమా బ్యానర్ పై తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇది కొంత మేరకు సినిమా కూడా ప్లస్ అవుతుంది అని చెప్పాలి.


Also Read : Ka Movie Climax : క్లైమాక్స్‌‌లో కన్నీళ్లు… సాడ్‌గా ఎండ్ అయ్యే స్టోరీ..?

ఇప్పటివరకు చాలామంది సినీ ప్రేమికులు కంటెంట్ చూసి ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నారు. కానీ ఊహించినంత బజ్ ఈ సినిమాకి రాలేదు. ఇప్పుడు కిరణ్ కన్నీళ్ళతో ఈ సినిమాకి బజ్ పెరిగింది అని చెప్పాలి. అలానే కిరణ్ వైఫ్ రహస్య కూడా మా ఆయన కోసం ఈ సినిమా చూడండి అంటూ మాట్లాడటం. నాగచైతన్య వంటి హీరో కూడా నువ్వు చాలామందికి ఇన్స్పిరేషన్. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది అని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మాటలు కూడా ఎక్కువ హైలైట్ అయ్యాయి. ఏదేమైనా ఒక సినిమా బాగుంటే దానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అని చెప్పడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే చాలా సినిమాలు ఉన్నాయి. అలానే కార్తికేయ సినిమాను ఆదరించారు. ఇంకా ఈ సంక్రాంతి సీజన్ లో వచ్చిన హనుమాన్ సినిమా కూడా అలానే బ్రహ్మరథం పట్టారు. ఖచ్చితంగా క సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారు.

Related News

Pooja Hegde: రియలైజ్ అయిన బుట్ట బొమ్మ.. ఇకనైనా సరిదిద్దుకుంటుందా..?

Pranitha Subhash: డిజైనర్ స్టూడియో ప్రారంభించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఎక్కడంటే..?

Gayatri Bhargavi: దుల్కర్ సల్మాన్ పై యాంకర్ షాకింగ్ కామెంట్స్..ఎలా పరిచయమబ్బా..?

Kiran Abbavaram KA: మ్యాజిక్ వర్కౌట్ అయిందే.. పుంజుకున్న ‘క’ మూవీ..!

Nora Fatehi: తప్పుడు మనుషులను నమ్మాను, మానసికంగా కృంగిపోయాను.. ‘మట్కా’ నటి కామెంట్స్

Narne Nithin: ఘనంగా ఎన్టీఆర్ బామ్మర్ది నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్..!

Samantha: ఒంటరితనం భరించలేకున్నా.. సామ్ మాటలకు అర్థం ఏమిటి..?

Big Stories

×