BigTV English

Kiran Abbavaram: సినిమాని తలపిస్తున్న హీరోగారి లవ్ స్టోరీ.. వింటే షాక్..!

Kiran Abbavaram: సినిమాని తలపిస్తున్న హీరోగారి లవ్ స్టోరీ.. వింటే షాక్..!

Kiran Abbavaram.. ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు “క” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా నిలువనుంది. 71వ దశకంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. సుజీత్ , సందీప్ దర్శకత్వం వహించిన క సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈనెల 31వ తేదీన తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.


సినిమాను తలపిస్తున్న కిరణ్ లవ్ స్టోరీ..

కిరణ్ అబ్బవరం తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కంటెంట్ ఇచ్చారు కిరణ్ అబ్బవరం. ఆయన మాట్లాడుతూ.. రాజా వారు రాణి గారు సినిమా షూటింగ్ మొదటి రోజు నేను ఆమె ప్రేమలో పడిపోయాను. అయితే ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాను అంటూ ఆయన తెలిపారు. తన ప్రేమ గురించి చెబుతూ.. రాజావారు రాణిగారు షూటింగ్ సమయంలోనే తన హీరోయిన్ రహస్య గోరఖ్ తో ప్రేమలో పడ్డానని, కానీ ఆమెతో చెప్పలేదని, మొదట శ్రేయభిమానంతోనే మొదలైన బంధం క్రమేనా స్నేహంలోకి మారి వైరల్ కావడంతో ఆ స్నేహం బలంగా మారి ఆమెతో నా ప్రేమ విషయాన్ని చెప్పేలా చేసింది. ఆ ప్రేమ కాస్త ఇప్పుడు పెళ్లి వరకు చేరింది అంటూ ఆయన తెలిపారు. రహస్య ను చూసిన మొదట్లోనే ఆమె అందానికి ముగ్ధుడయ్యాను. ఆమెను చూడగానే ఏదో తెలియని అనుభూతి. అదే నన్ను ఆమె వైపు లాక్కెళ్ళింది అంటూ వివరణ ఇచ్చారు కిరణ్ అబ్బవరం. ఇక ఈయన చేసిన కామెంట్లు వైరల్ అవ్వడంతో మీ లవ్ స్టోరీ తో సినిమా తీసేయొచ్చు గురూ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న కిరణ్ , రహస్య..

ఇకపోతే ఆగస్టు 22న వీరి వివాహం కర్ణాటకలోని కూర్గ్ లో చాలా ఘనంగా జరగగా, ప్రేమ కథను పెళ్లి వరకు తీసుకెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో స్నేహితుల మధ్య సంతోషంగా వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరి ప్రొఫెషనల్ విషయానికొస్తే.. అటు కిరణ్ , ఇటు రహస్య ఇద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గానే తమ కెరియర్ ను కొనసాగించారు. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ లో అడుగు పెట్టి తమ అభిరుచిని చాటుకున్నారు.అదే ఆసక్తి రాజావారు రాణిగారు చిత్రంలో కథానాయకులు అవ్వడానికి కారణం అవ్వగా.. అదే చిత్రం వారికి మంచి బ్రేక్ ఇచ్చింది. అదే సినిమాలో నటనపై ఉన్న ప్రేమను వారిని మరింత దగ్గరగా తీసుకెళ్లగా.. వీరి ప్రేమ కథ కేవలం సినిమా ద్వారానే కాకుండా నిజజీవితంలో కూడా అందరికీ ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇన్ని రోజులు తన ప్రేమను సీక్రెట్ గా ఉంచి, సరైన సమయం చూసి పెళ్లి చేసుకున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×