Sai Sreenivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా కిష్కింధపురి. ఈ సినిమా సాయి శ్రీనివాస్ కెరియర్ లో 11వ సినిమాగా రానుంది. ఈ మూవీలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కౌశిక్ పగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ టైటిల్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా మన ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్రా యూనిట్ ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ప్రకటించింది. దాని గురించి తెలుసుకుందాం..
ఫస్ట్ గ్లిమ్స్..
సాయి శ్రీనివాస్ నటిస్తున్న కిష్కిందపురి సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను అధికారికంగా విడుదల చేశారు. ఆ వీడియోలో .. మొదట్లో ఒక పాడుబడిన బంగాళా ని చూపిస్తారు. అనుపమ పరమేశ్వరన్ హీరో ఆ బంగ్లాలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. లోపల ఎంతో భయానకమైన దృశ్యాలు వారికి కనిపిస్తాయి. ఆ హీరో హీరోయిన్స్ ఇద్దరు సమాచారం కోసం వెతుకుతూ ఉంటారు. సాయి శ్రీనివాస్ ఈ వీడియో క్లైమాక్స్ లో అహం మృత్యువు అని గట్టిగా అరుస్తాడు అక్కడితో వీడియో ఎండ్ అవుతుంది. ఈ గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాయి శ్రీనివాస్ థ్రిల్లర్ మూవీ తో మన ముందుకు రానున్నారు. అనుపమ, సాయి శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి హిట్ కానుంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
సస్పెన్స్, థ్రిల్లర్…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న కొత్త సినిమా కిష్కింధపురి. సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది. రాక్షసుడు సినిమా తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. శ్యామ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో ఒక పురాతన గుడికి కాపలాగా,హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎదురుగా ఎటువంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కొనేందుకు రెడీగా హీరో గుడి ఎదుట నిలబడడం.. గుడి వెనుకాల నరసింహస్వామిని చూపించడం ఈ వీడియోలో మనకి కనిపిస్తుంది. సాయి శ్రీనివాస్ కెరియర్ లోనే అత్యంత కీలకమైన చిత్రం గా క్రిష్కింధపురి రానుంది. హర్రర్ మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ గా ఈ సినిమా రానుంది. ఇప్పటికే సాయి శ్రీనివాస్ భైరవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.అది పూర్తీ అయినా తరువాత ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.ఏది ఏమైనా సాయి శ్రీనివాస్ ఫుల్ ఫామ్ లో వున్నాడు.వరుసగా సినిమాలతో ప్రేక్షకులను అలరించటానికి రెడీ అయ్యాడు.ఈ సినిమాలు అన్ని విజయం సాదించాలని మనము కోరుకుందాం ..