Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో.. 14 సంవత్సరాల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేయడంతో అందరూ… అతని గురించి సెర్చ్ చేస్తున్నారు. ఎవడబ్బ వీడు… ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు అంటూ… అందరూ చర్చించుకుంటున్నారు. సోమవారం రాత్రి… గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్య వంశీ పేరు…. ఓ 15 ఏళ్ల పాటు క్రికెట్ చరిత్రలో వినిపించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఐపీఎల్ టోర్నమెంట్ లోకి రాకముందు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi ) ఏం చేశాడనే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధోని టీం కు సపోర్ట్ చేసిన 14 ఏళ్ల కుర్రాడు
ఐపీఎల్ టోర్నమెంట్ నేపథ్యంలో… వెలుగులోకి వచ్చిన 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ… తన ఆరు సంవత్సరాల వయసులోనే క్రికెట్ స్టేడియానికి వెళ్లడం మొదలుపెట్టాడు. తన కుటుంబ సభ్యులతో పాటు నిత్యం ఐపిఎల్ మ్యాచ్ లు చూసేవాడు. 2017 ఐపిఎల్ సీజన్ సందర్భంగా.. తన ఫ్యామిలీతో స్టేడియానికి కూడా వెళ్ళాడు వైభవ్ సూర్య వంశీ. అప్పుడు సూర్య వంశీ ఏజ్ ఆరు సంవత్సరాలు మాత్రమే. 2017 ఐపీఎల్ సీజన్ సందర్భంగా రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ జట్టుకు సపోర్ట్ చేస్తూ స్టేడియానికి వెళ్ళాడు. ఇక ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు సూపర్ సెంచరీ తో… 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ అదరగొట్టాడు.
ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్ గా రికార్డు
ఐపిఎల్ 2025 టోర్నమెంటులో భాగంగా సోమవారం రోజున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల ( Rajasthan Royals vs Gujarat Titans ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో 14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ 35 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసినా రెండవ ప్లేయర్గా రికార్డు లోకి ఎక్కాడు 14 ఏళ్ల సూర్య వంశీ. సూర్య వంశీ కంటే ముందు క్రిస్ గేల్ (Chris gayle) ఉన్నాడు. అతడు కేవలం 30 బంతులలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే… 17 సంవత్సరాల ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ( IPL 2025) ఇప్పటివరకు 35 బంతుల్లో సెంచరీ చేసిన ఇండియన్ ప్లే యర్ ఎవ్వరు లేరు. ఆ రికార్డును కూడా తాజాగా 14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇది ఇలా ఉండగా… రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ అద్భుతమైన సెంచరీ చేయడంతో మ్యాచ్ గెలిచింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్.
Also Read: Vaibhav Suryavanshi: బుడ్డోడు అనుకున్నార్రా.. 14 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ సెంచరీ