BIG TV LIVE Originals: క్రూయిజ్ షిప్. వెకేషన్స్ కోసం ఉపయోగించే పెద్ద నౌకలు. ఒక్కో క్రూయిజ్ షిప్ ఓ మహా నగరాన్నితలపిస్తుంది. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాల్స్, బార్లు, పబ్ లు, ఫిట్ నెస్ సెంటర్లు, లైబ్రరీలు, హాస్పిటల్ సహా అన్ని సదుపాయాలు ఉంటాయి. క్రూయిజ్ షిప్ ఒకేసారి వేలాది మంది పర్యాటకులను సముద్రంలో తీసుకెళ్తుంది. వారాలు, నెలల తరబడి సముద్రంలోనే తిప్పేస్తుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. ప్రపంచ వ్యాప్తంగా 350కి పైగా క్రూయిజ్ షిప్ లు ఉన్నాయి. క్రూయిజ్ షిప్ లను సాధారణంగా నీటిపై తేలియాడే స్టార్ హోటళ్లుగా పరిగణిస్తారు. చాలా క్రూయిజ్ షిప్ లు కరేబియన్ లేదంటే మధ్యధరా సముద్రంలో ప్రయాణిస్తాయి. మరికొన్ని అలస్కా, సౌత్ పసిఫిక్, బాల్టిక్ సుముద్రంలో తిరుగుతుంటాయి. క్రూజ్ షిప్ కు సంబంధించి కొన్ని క్రేజీ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ ఆలస్యంగా వెళ్లకూడదు
క్రూజ్ షిప్ లో విహారయాత్రకు టికెట్ బుక్ చేసుకుంటే, కచ్చితంగా అనుకున్న సమయానికి షిప్ దగ్గరికి వెళ్లాలి. ఒకవేళ మీరు ఆలస్యంగా వెళ్తే, అప్పటికే వెళ్లిపోతుంది. ప్రర్యాటకులు అందరూ వచ్చే వరకు క్రూయిజ్ షిప్ లు వెయిట్ చేయవు. ఈ షిప్ ల విషయంలో రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. కచ్చితంగా అనుకున్న సమయానికి బయల్దేరాల్సిందే. లేదంటే ఫైన్ వేస్తారు. అందుకే, క్రూయిజ్ షిప్ అనేది ఆన్ టైమ్ వెళ్తుంది. ఒకవేళ మీరు కూడా ట్రిప్ కు వెళ్తే కచ్చితంగా అనుకున్న సమయానికి వెళ్లాల్సిందే.
⦿ మార్చురీ
క్రూయిజ్ షిప్ లో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. రిలాక్స్ అయ్యేందుకు స్విమ్మింగ్ పూల్స్, సమాజ్ సెంటర్లు, ఫిట్ నెస్ సెంటర్లు, ఎంటర్ టైన్ మెంట్ ఉంటాయి. అలాగే మార్చురీ కూడా ఉంటుంది. నౌకలో ఒకేసారి వేల మంది ప్రయాణిస్తారు. ఎవరి చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. అనివార్య పరిస్థితులలో ఎవరైనా చనిపోతే వారి డెడ్ బాడీని భద్రపరిచేందుకు షిప్ కింది భాగంలో మార్చురీ ఉంటుంది.
⦿ హాల్టింగ్
క్రూయిజ్ షిప్ లు ప్రయాణ మధ్యలో పెద్ద పెద్ద నగరాల్లో ఆగుతుంది. షిప్ లోని ప్రయాణీకులు ఆయా నగరాలను చూసేందుకు వెళ్తారు. కానీ, బయటకు వెళ్లడం కంటే షిప్ మొత్తాన్ని ఎక్స్ ప్లోర్ చేయడం మంచిది. నౌకలో ఎవరూ ఉండరు కాబట్టి, అన్ని ప్రదేశాలను తిరిగి చూడవచ్చు. ఇతర నగరాలకు వెళ్లడం వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఇందులోనే ఉండి అన్ని తిరిగి చూడ్డం వల్ల ఖర్చు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులు దిగిన సమయంలో క్రూయిజ్ లోని స్పాలు, రెస్టారెంట్లలో డిస్కౌంట్లు కూడా ఇస్తాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు.
⦿ ప్రైవేట్ రూమ్స్
క్రూయిజ్ షిప్ లో ప్రైవేట్ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ, ఈ రూమ్స్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గతంలో కొన్నిసార్లు ప్రైవేట్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డాయి. ఒకవేళ మీరు కూడా క్రూయిజ్ షిప్ లో ప్రైవేట్ రూమ్స్ బుక్ చేసుకుంటే హిడెన్ కెమెరాలు ఉన్నాయోమో ఓసారి చెక్ చేసుకోవడం మంచిది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: 18 ఏళ్లు ఎయిర్ పోర్టులోనే బతికాడు, స్పీల్ బర్గ్ సినిమాకు ప్రేరణ అయ్యాడు.. చివరికి అక్కడే..