E-Paper
Advertisement

Kissik talks Promo: ఈ క్షణం పోయినా చాలు.. అరియానా జీవితంలో ఇంత విషాదమా?

Kissik talks Promo: ఈ క్షణం పోయినా చాలు.. అరియానా జీవితంలో ఇంత విషాదమా?
Advertisement

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ టాక్ షోలు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఛానల్ ఉంటే చాలు ఆ ఛానల్ వారే స్వయంగా ఒక టాక్ షోను నిర్వహిస్తూ.. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా వారి జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బిగ్ టీవీ ఛానల్ కూడా కిస్సిక్ టాక్స్ అంటూ ఒక టాక్ షో నిర్వహిస్తోంది. ఇప్పటికే సుమారుగా 41 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. తాజాగా 42వ ఎపిసోడ్ ని కూడా ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రసారం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.

రోజుకు ఐదు ఉద్యోగాలు చేసేదాన్ని..

ఇకపోతే ఈసారి అతిథిగా ప్రముఖ యాంకర్ అరియానా విచ్చేశారు. ఈమె తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందుల గురించి చెప్పి ఈ క్షణం ఇప్పుడే చనిపోయినా నాకు ఇబ్బంది లేదు అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. టాక్ షోలో భాగంగా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పమని హోస్ట్ వర్ష అడగగా.. జీవితంలో ఎప్పుడు ఏ క్షణం ఎలా జరుగుతుందో తెలియదు. జీవితం చాలా చిన్నది.. నచ్చినప్పుడు నచ్చిన పని చేసి ఈ జీవితాన్ని ఆస్వాదించాలి. నేను ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు నా వద్ద రూపాయి కూడా లేదు. అలా క్యూలో నిలబడి పన్నీరు చల్లే ఉద్యోగాన్ని సంపాదించాను. మూడు గంటలు పనిచేస్తే 1800 ఇచ్చేవారు. ఆ 1800 పెట్టుకొని 3000 రెంట్ అయితే సగం కట్టి మిగతాది మళ్లీ ఇస్తానని అడుక్కునే పరిస్థితి నాది. మరుసటి రోజు రెంట్ కట్టాలి .కానీ ఆలోపే ఆ 1800 వేరే అమ్మాయి దొంగతనం చేసింది. అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాను పైగా రోజుకి ఐదు ఉద్యోగాలు చేసేదాన్ని.

ఈ క్షణమే చనిపోయినా పర్వాలేదు..

Advertisement

ఇక యాంకర్ కావాలి అని టీవీలో యాడ్ చూసి వచ్చిన నాకు రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ దేవుడు ఇచ్చిన అదృష్ట అవకాశం అని భావించాను. నేను క్రిస్టియన్ గానే పెరిగాను. కానీ నాకు ఈ మధ్యకాలంలో సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా భక్తి, ఇష్టం పెరిగిపోయింది. ఆ స్వామి వచ్చి ఏమైనా కావాలా అని కోరితే ఇప్పుడే నన్ను ఈ క్షణమే తీసుకెళ్లి పొమ్మని కోరతాను. ఇంతకంటే అదృష్టం మరొకటి నాకు వద్దు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తన జీవితంలో తాను ఎదుర్కొన్న మరెన్నో ఇబ్బందులను పంచుకుంది. ఇక పూర్తి విషయాలు తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. మొత్తానికైతే అరియానా జీవితంలో ఇంత విషాదం ఉంది అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ALSO READ:Drugs Case: డ్రగ్స్ కేసులో పరారైన వాడు ఈ హీరోయిన్ తమ్ముడే… ఇది రెండో సారి??

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×