E-Paper
Advertisement

Samsung Foldable Discount: శాంసంగ్ కొత్త ఫోల్డెబుల్ ఫోన్ పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.65000 డిస్కౌంట్.. ఎక్కడంటే

Samsung Foldable Discount: శాంసంగ్ కొత్త ఫోల్డెబుల్ ఫోన్ పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.65000 డిస్కౌంట్.. ఎక్కడంటే
Advertisement

Samsung Foldable Discount| శామ్‌సంగ్ తన ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 (Galaxy Z Fold 6) ధరను భారీగా తగ్గించింది. 2024 జూలై లో లాంచ్ అయిన ఈ ఖరీదైన ఫోన్. ప్రీమియం బడ్జెట్ యూజర్లు కొనలేకపోయారు. కానీ ఇప్పుడు శామ్‌సంగ్ ఫ్యాన్స్‌కు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. దాదాపు రూ.65,000 డిస్కౌంట్‌తో ఈ ఫోన్ లభిస్తోంది. ఈ డీల్‌తో ఫోల్డబుల్ ఫోన్ మరింత అందుబాటులోకి వచ్చింది. న్యూ ఇయర్ షాపింగ్ చేసేవాళ్లకు ఇది లిమిటెడ్ ఆఫర్. గిఫ్ట్‌గా కూడా ఇవ్వవచ్చు. పాపులర్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ డిస్కౌంట్ ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 డిస్‌ప్లే, డిజైన్ వివరాలు

ఈ ఫోన్‌లో అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లే టెక్నాలజీ ఉంది. 7.6 ఇంచుల డైనమిక్ AMOLED 2X మెయిన్ స్క్రీన్ ఉంది. 6.3 ఇంచుల కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. రెండు స్క్రీన్లు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. స్క్రోలింగ్, గేమింగ్ స్మూత్‌గా ఉంటుంది. బ్రైట్ కలర్స్, షార్ప్ విజువల్స్ లభిస్తాయి. మల్టీటాస్కింగ్ కోసం డిజైన్ చేశారు. మెయిన్ స్క్రీన్‌లో ట్యాబ్లెట్ లాంటి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. కవర్ డిస్‌ప్లే క్విక్ టాస్క్‌లకు హెల్ప్ అవుతుంది.

పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ సూపర్

Advertisement

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పవర్ ఇచ్చారు. హెవీ యాప్స్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది. 12GB ర్యామ్‌తో మల్టీటాస్కింగ్ స్మూత్. యాప్స్ త్వరగా ఓపెన్ అవుతాయి, ల్యాగ్ ఉండదు. లాంగ్ గేమింగ్ సెషన్స్‌లో స్టెబుల్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ బేస్డ్ ఇంటర్‌ఫేస్ ఉంది. ఫోల్డబుల్ స్క్రీన్‌లకు ఆప్టిమైజ్ చేశారు. స్ప్లిట్ స్క్రీన్‌తో మల్టిపుల్ యాప్స్ ఒకేసారి రన్ చేయవచ్చు. ప్రొడక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది.

కెమెరా సెటప్, బ్యాటరీ పెర్ఫామెన్స్

ఈ ఫోల్డెబుల్ ఫోన్ లో వెర్సటైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్‌ (వెనుకభాగం) లో 50MP, 12MP, 10MP సెన్సార్లు. వివిధ లైటింగ్ కండీషన్స్‌లో బాగా ఫోటోగ్రఫీ చేస్తుంది. 10MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు బెస్ట్. ఇమేజ్ ప్రాసెసింగ్ మెరుగుపరిచారు. 4,400mAh బ్యాటరీ ఉంది. పూర్తి రోజు యూసేజ్ సపోర్ట్ చేస్తుంది. మల్టీటాస్కింగ్, స్ట్రీమింగ్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ డీల్‌తో భారీ సేవింగ్స్

Advertisement

లాంచ్ సమయంలో ధర రూ.1,64,999 ఉండేది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో సిల్వర్ షాడో 256GB వేరియంట్ రూ.1,03,933కు లిస్ట్ అయింది. అంటే రూ.61,066 ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది. ఎంచుకున్న క్రెడిట్ కార్డులతో మరో రూ.4,000 డిస్కౌంట్. మొత్తం సేవింగ్స్ దాదాపు రూ.65,000. ఈ ధర తగ్గింపు ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తోంది. ఫోల్డబుల్ బెస్ట్ డీల్స్‌లో ఇది ఒకటి.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

డిస్కౌంట్ ఆఫర్లలోఐఫోన్ 16 కూడా

ఆపిల్ ఫ్యాన్స్‌కు కూడా గుడ్ న్యూస్. ఐఫోన్ 16 డిస్కౌంట్ ధరల్లో లభిస్తోంది. క్రోమాలో రూ.69,900కు ఉంది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో ధర దాదాపు రూ.41,000కే వస్తుంది. ఐఫోన్ 16 ఆపిల్ టాప్ సెల్లింగ్ మోడల్. ప్రీమియం ఆండ్రాయిడ్, iOS ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు.

ఇప్పుడు గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ కొనడానికి బెస్ట్ టైమ్

ఈ డిస్కౌంట్‌తో గెలాక్సీ Z ఫోల్డ్ 6 అందుబాటు ధరలోకి వచ్చింది. ఫోల్డబుల్ టెక్నాలజీ మరిన్ని వాళ్లకు అందుతోంది. పవర్, స్టైల్, ఇన్నోవేషన్ ఇస్తుంది. ఫోల్డబుల్ ఫోన్ కావాలనుకునేవాళ్లు ఇప్పుడే కొనండి. ఇలాంటి డీల్స్ లభించడం కష్టం.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×