E-Paper
Advertisement

బండ్ల మీద దొరికే పెసర పునుగుల సీక్రెట్ ఇదే..స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇక మీ ఇంట్లోనే!

బండ్ల మీద దొరికే పెసర పునుగుల సీక్రెట్ ఇదే..స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇక మీ ఇంట్లోనే!
Advertisement

Street style pesarapunukulu: ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ కల్చర్‌లో ఈవెనింగ్ స్నాక్స్‌కు ఉండే క్రేజే వేరు. ఆఫీస్ నుంచి లేదా కాలేజీ నుంచి ఇంటికి రాగానే నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ముందుగా.. గుర్తుకు వచ్చేది బండ్ల మీద దొరికే వేడి వేడి పునుగులే. ముఖ్యంగా ..పెసరపప్పుతో చేసే పెసరపునుకులకు ఉండే ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. చాలామంది ఇంట్లో.. ఈ పునుగులు చేసినా ఆ బండ్ల మీద దొరికే రుచి రాదని ఫీలవుతుంటారు. కానీ.. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. అంతకంటే అద్భుతమైన రుచితో ఇంట్లోనే పెసర పునుకులు తయారు చేసుకోవచ్చు.ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

తొక్క పెసరపప్పు – 1 కప్పు

Advertisement

బియ్యం పిండి – 2 లేదా 3 స్పూన్లు

పచ్చిమిర్చి – 4 లేదా 5

Advertisement

అల్లం – చిన్న ముక్క

జీలకర్ర – 1 స్పూన్

ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినవి)

కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

1. పెసరపునుకులు పర్ఫెక్ట్‌గా రావడానికి మొదటి మెట్టు పప్పును నానబెట్టడం. వీలైతే పొట్టు ఉన్న పెసరపప్పును వాడటం మంచిది. దీనిని కనీసం 3 నుంచి 4 గంటల పాటు మంచి నీళ్లలో నానబెట్టాలి. పప్పు బాగా.. నానితేనే పిండి మెత్తగా, అదే సమయంలో గుల్లగా వస్తుంది. నానిన పెసరపప్పును మిక్సీ జార్‌లో లేదా గ్రైండర్‌లో వేయాలి. అయితే ..గుర్తుంచుకోండి, పినిని మరీ నీళ్లలాగా మెత్తగా రుబ్బకూడదు. కొంచెం బరకగా, అస్సలు నీళ్లు ఎక్కువగా వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి. దీని వల్ల నూనెలో వేయగానే పునుగులు గుల్లగా వస్తాయి.

2. రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, చేతితో కనీసం 2-3 నిమిషాల పాటు కలపాలి.ఇలా చేయడం వల్ల పిండిలోకి గాలి చేరి పునుగులు దూదిలా సాఫ్ట్‌గా వస్తాయి. అలాగే.. ఇందులో 2 నుంచి 3 స్పూన్ల బియ్యం పిండిని కలపాలి. ఈ బియ్యం పిండే ..బండ్ల మీద దొరికే పునుగుల్లా కరకరలాడటానికి ప్రధాన కారణం. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి-అల్లం పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరి పడా ఉప్పు వేసి బాగా కలపాలి.

Also Read: మునగాకు పచ్చడి ఇలా చేస్తే..అద్భుతమైన రుచితో పాటు ఫుల్ ప్రొటీన్స్!

3.స్టవ్ వెలిగించి ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా కాగనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, చిన్న చిన్న పునుగులుగా నూనెలో వేయాలి. ఇవి బంగారు రంగు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. అంతే పునుగులు రెడీ

వేడి వేడి పెసరపునుకులను అల్లం చట్నీతో లేదా పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే ఆ రుచి మాటల్లో చెప్పలేం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఈవెనింగ్ మీ ఇంట్లో కూడా ఈ సీక్రెట్ రెసిపీని ట్రై చేసి అందరితో శభాష్ అనిపించుకోండి!

Related News

స్వీట్ హౌస్ స్టైల్ బ్రెడ్ హల్వా..ఇంట్లోనే ఇలా టేస్టీగా రెడీ చేయండి

చీజ్ లవర్స్‌కు తప్పకుండా నచ్చే ‘ఎగ్‌ప్లాంట్ పార్మిజియానా’.. లొట్టలేసుకుంటూ తినడం ఖాయం!

సొరకాయ పచ్చి కారం కూర ఇలా చేస్తే..ఒక్క ముద్ద కూడా వదలరు!

ఐస్‌క్రీమ్‌ను ఇలా కూడా తయారుచేయొచ్చా? ఈ జపనీస్ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

సింపుల్‌గా హైదరాబాదీ రాయల్ మటన్ మరగ్.. ఇంటికొచ్చిన అతిథులు ముగ్దులైపోవాల్సిందే!

డిప్రెషన్, స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలా? ఈ 5 జపాన్ టెక్నిక్స్ మీ కోసమే

రోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వచ్చేస్తోందా? మీ శరీరం ఏం చెబుతోందంటే!

Big Stories

Advertisement
×