Kiccha Sudeep:కన్నడ హీరోలలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)అంటే తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే ఈయన తెలుగులో కూడా పలు సినిమాల్లో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోగా చేశారు. అయితే కిచ్చా సుదీప్ తెలుగులో రాజమౌళి(Rajamouli )దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమా ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన కిచ్చా సుదీప్ హీరో నాని(Nani ) కంటే ఎక్కువ ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం కొన్ని సన్నివేశాలు రియల్ గా చేశారట.అయితే అలాంటి కిచ్చా సుదీప్ తాజాగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన ఒక ప్రతిష్టాత్మక అవార్డును కూడా రిజెక్ట్ చేశారు. మరి ఇంతకీ ఆ అవార్డు ఏంటి..? ఎందుకు ఆ అవార్డుని తీసుకోవడానికి తిరస్కరించారు?అనేది ఇప్పుడు చూద్దాం.
కర్ణాటక ప్రతిష్టాత్మక అవార్డుకి ఎన్నికైన సుదీప్..
గత కొద్దిరోజుల నుండి కిచ్చా సుదీప్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం ఆయన బిగ్ బాస్ (Kannada Bigg Boss) హోస్ట్ నుండి తప్పుకోవడమే. అలాగే నటనకు కూడా రిటైర్మెంట్ ఇస్తానంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అలాంటి కిచ్చా సుదీప్ నటించిన ‘పహిల్వాన్’ సినిమాలోని ఆయన నటనకి గానూ కర్ణాటక ప్రభుత్వం మెచ్చి ఆయనకు కర్ణాటక ప్రతిష్టాత్మక అవార్డు అయినటువంటి రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డుని ప్రకటించింది. అయితే రాష్ట్రంలో అత్యుత్తమమైన అవార్డు రావడంతో ఏ హీరో అయినా సరే సంబరపడతారు. కానీ కిచ్చా సుదీప్ మాత్రం తనకి వచ్చిన అవార్డుని తిరస్కరించారు. తనకి ఆ అవార్డు వద్దు అని రిజెక్ట్ చేయడం ప్రస్తుతం కన్నడ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.మరి ఇంతకీ కిచ్చా సుదీప్ అవార్డుని ఎందుకు రిజెక్ట్ చేశారో? ఆయన ఓ పోస్ట్ ద్వారా తెలియజేశారు.
అవార్డును తిరస్కరించిన కిచ్చా సుదీప్..
కిచ్చా సుదీప్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు.. “ఉత్తమ నటుడి క్యాటగిరిలో నన్ను జ్యూరీ సభ్యులు ఎంపిక చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞతుడిని. కానీ ఈ అవార్డు తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు.కొద్ది సంవత్సరాల పాటు ఈ అవార్డులకు దూరంగా ఉండాలి. కానీ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు మీకు ధన్యవాదాలు.
కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ అవార్డు తీసుకోవాలి అనుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీలోని కళామతల్లికి తమ జీవితాలను అంకితం చేస్తూ ఉండే ఎంతోమంది గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు. ఆ హీరోలలో ఎవరో ఒకరికి ఈ అవార్డుని ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాకంటే గొప్పగా నటించిన వాళ్లు ఉన్నారు. వారికి ఈ అవార్డు ఇవ్వడం ఆనందకరం. ఈ ప్రతిష్టాత్మక అవార్డు వాళ్ళకి ఇవ్వడమే గర్వకారణం.ఆ హీరోలలో ఎవరో ఒకరికి ఈ అవార్డు ఇస్తే నాకు మరింత ఆనందం. జ్యూరీ మెంబర్స్ నన్ను ఎంపిక చేయడమే నాకు అసలైన అవార్డు. మీరు నన్ను ఎంపిక చేసినందుకు ప్రోత్సాహంగా నేను సినిమాల్లో మరింత బాగా నటిస్తాను. ఇదే నాకు పెద్ద ప్రోత్సాహం. ప్రేక్షకులను అలరించే ఉద్దేశంతో ఉన్న నాకు ఈ అవార్డులపై ఆశలు లేవు.అయితే నేను తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని, జ్యూరీ మెంబర్స్ ని బాధపెట్టి ఉండవచ్చు. కానీ మీరందరూ నేను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నాను. అలాగే సినిమాల్లో నటిస్తున్నందుకు, నా కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వానికి జ్యూరీ మెంబర్స్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను”.. అంటూ కిచ్చా సుదీప్ ఒక పెద్ద పోస్ట్ పెట్టి తాను ఈ అవార్డు తీసుకోవడానికి సముఖంగా లేనని,ఈ అవార్డుని తిరస్కరిస్తున్నట్టు తన ప్లేస్ లో మరో గొప్ప హీరోకి అవార్డుని కేటాయించాలి అని చెబుతూ పోస్ట్ పెట్టారు.. ప్రస్తుతం కిచ్చా సుదీప్ పెట్టిన పోస్ట్ చూసి చాలామంది కన్నడ ప్రేక్షకులు సైతం షాక్ అవుతున్నారు. ఇక కిచ్చా సుదీప్ అభిమానులు మాత్రం నువ్వు గొప్పోడివయ్యా..నీకు వచ్చిన అవార్డుని మరొకరికి ఇవ్వమని చెబుతున్నావంటే నీ మనసెంత మంచిదో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Respected Government of Karnataka and Members of the Jury,
It is truly a privilege to have received the state award under the best actor category, and I extend my heartfelt thanks to the respected jury for this honor. However, I must express that I have chosen to stop receiving…
— Kichcha Sudeepa (@KicchaSudeep) January 23, 2025