BigTV English

Colours Swathi: భర్తకు విడాకులు ఇచ్చిన కలర్స్ స్వాతి.. ఇదిగో సాక్ష్యం.. ?

Colours Swathi: భర్తకు విడాకులు ఇచ్చిన కలర్స్ స్వాతి.. ఇదిగో సాక్ష్యం.. ?

Colours Swathi: అచ్చ తెలుగు హీరోయిన్స్ లిస్ట్ లో స్వాతి రెడ్డి పేరు టాప్ 10 లో ఉంటుంది. కలర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్  అయిన ఆమె.. అప్పటినుంచి కలర్స్ స్వాతిగా  మారిపోయింది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  బూరె బుగ్గలు.. కలువలాంటి కళ్లు.. పన్ను మీద పన్నుతో ఎంతో క్యూట్ గా కనిపించి కుర్రాళ్ళ గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.


మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న ఈ చిన్నది.. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించింది. గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర లాంటి హిట్ సినిమాల్లో నటించిన స్వాతి .. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వికాస్ వాసు అనే ఫైలెట్ ను వివాహమాడింది. పెళ్లి తరువాత కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైన స్వాతి.. పంచతంత్రం అనే సినిమాతో రీఎంట్రీ  ఇచ్చింది.

ఇక దీని తరువాత  సాయి ధరమ్ తేజ్ తో కలిసి  సత్య అనే  సాంగ్ చేసింది. ఈ సాంగ్  మంచి విజయాన్ని అందుకుంది. దీంతో పాటు ఆమె నటించిన మంత్ ఆఫ్ మధు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇవన్నీ పక్కన  పెడితే.. గత కొన్నేళ్లుగా స్వాతి భర్తకు విడాకులు ఇచ్చిందన్న వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. ఆ వార్తలకు ఆజ్యం పోస్తూ ఇన్స్టాగ్రామ్ లో తన భర్తకు సంబంధించిన ఏ ఫోటోను కూడా ఆమె ఉంచకుండా డిలీట్ చేసింది.


Sudigali Sudheer: వామ్మో.. సుధీర్ అంత సంపాదించాడా.. మూడు ఇళ్లు.. నిజాలు బయటపెట్టిన స్టార్ కమెడియన్

ఇక ఇదే విషయాన్నీ స్వాతిని అడిగితే ఆమె.. ” ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు లేకపోవడం వైవాహిక విభేదాలకు సూచన కాదని, అది వ్యక్తిగత నిర్ణయం.. మా ఫోటోలను ఆర్కైవ్ చేశాను ” అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో అందరు అడుగుతున్నారు అని  ఆమె ఆలా చెప్పిందని ఇప్పుడు తేలిపోయింది. తాజాగా స్వాతి.. తన భర్తను ఆన్ ఫాలో కూడా చేసింది.

అసలు మచ్చుకు కూడా ఆమె సోషల్ మీడియాలో వికాస్ కు సంబంధించిన ఏ ఒక్క ఫోటో కూడా కనిపించలేదు. ఆమె ఫాలోవర్స్ లో తన  భర్త పేరు లేదు. దీంతో నెటిజన్స్ సరే ఫోటోలను ఆర్కైవ్ చేసావ్ ఓకే.. మరి  ఇప్పుడెందుకు ఆయనను ఆన్ ఫాలో చేసావ్ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో స్వాతి.. వికాస్ కు విడాకులు ఇచ్చెసినట్లే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం స్వాతి విడాకుల వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇప్పుడైనా ఈ హీరోయిన్ తన విడాకుల విషయం అధికారికంగా అభిమానులకు చెప్తుందేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×