BigTV English

Vishal: విశాల్ కాబోయే భార్య ధన్సికకు తనకు ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? పాపం… మరీ ఇంత చిన్నపిల్లా..?

Vishal: విశాల్ కాబోయే భార్య ధన్సికకు తనకు ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? పాపం… మరీ ఇంత చిన్నపిల్లా..?

Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తెలుగులో పందెంకోడి, పొగరు, భరణి వంటి తెలుగు సినిమాలలో నటించి మెప్పించారు. తమిళ్ లోనే కాక విశాల్ కు తెలుగు ఇండస్ట్రీలోనూ భారీగా అభిమానులు ఉన్నారు. గత సంవత్సరం రత్నం సినిమాలో నటించి మెప్పించారు. ఇక తాజాగా ఈ హీరో పెళ్లికి సిద్ధమైనట్లు ఇటీవల తెలిపారు.తాజాగా అతను నటి ధన్సికతో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఆ వివరాలు చూద్దాం.


విశాల్ కాబోయే భార్య ధన్సికకు తనకు ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..

తమిళ్ స్టార్ విశాల్ కు తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సహజమైన నటుడుగా ఆయనకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సౌత్ ఇండస్ట్రీ నటుల సంఘానికి అతను కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇక అయితే ఎప్పటినుంచో విషయాలు పెళ్లి గురించి పెద్ద చర్చ కోలీవుడ్ లో జరుగుతున్నాయి. తాజాగా ఓ ఈవెంట్ లో సాయి ధన్సిక హీరో విశాల్ ను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది. చెన్నైలో సాయి ధన్సిక నటిస్తున్న యోగిదా మూవీ ఈవెంట్ లో అతిథిగా విశాల్ విచ్చేశారు. ఇక అందరి సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు సాయిదన్సిక,విశాల్ ఏజ్ గురించి సోషల్ మీడియాలోఓ వార్త వైరల్ అవుతుంది.


సాయి ధన్సిక గురించి ..

సాయి ధన్సిక 2006లో మనతోడు మలైకాలం చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి మూవీ తో పాపులర్ అయ్యారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కూతురి పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగులో షికారు, అంతిమతీర్పు, దక్షిణా, వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి మెప్పించారు. ఇక 35 ఏళ్ల సాయి ధన్సిక, 47 ఏళ్ల విషయాలను పెళ్లి చేసుకుంటారనే వార్తతో వీరి మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉందని విశాల్ మరీ చిన్న పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లికి వయసుతో సంబంధం లేదని ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయం, ప్రేమ బలంగా ఉంటే వారిద్దరూ వివాహ జీవితం సంతోషంగా గడుపుతారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయినా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి కామెంట్స్ అన్ని సర్వసాధారణం. ఇక మొత్తానికి తమిళ్ స్టార్ విశాల్ ఇప్పటికైనా ఓ ఇంటి వాడవుతున్నాడని అతని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×