Sanjiv Goenka : ఐపీఎల్ 2025 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. ఇప్పటికే ప్లే ఆప్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు తనతో పాటు ఎల్ఎస్జీ ని కూడా తీసుకెళ్లింది. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సన్ రైజర్స్ విజయం సాధించింది. 12 మ్యాచ్ లలో 7వ పరాజయంతో లక్నో జట్టు ప్లే ఆప్స్ కి దూరమైంది. హైదరాబాద్ నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చివరి ప్లే ఆప్స్ బెర్తు కోసం ముంబై, ఢిల్లీ మధ్యనే కీలక పోటి నెలకొంది. ఐపీఎల్ ప్లే ఆప్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ నిష్క్రమించడంతో ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా స్పందించారు. టోర్నీలో సెకండ్ హాప్ చాలా కఠినంగా సాగింది. కానీ దాని నుంచి చాలా నేర్చుకున్నాం. కుర్రాళ్లు స్పిరిట్, ఎఫర్ట్ చూపించారు. మిగిలిన రెండు మ్యాచ్ లను గర్వంగా ఆడి ఫినిష్ చేస్తామని టీమ్ ప్లేయర్లతో కలిసి ఉన్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
పంత్ కి రూ.27 కోట్లు బొక్క..
మరోవైపు రూ.27కోట్లు పెట్టి రిషబ్ పంత్ ని కొనుగోలు చేస్తే.. అంతగా రాణించలేదు. ఇక పంత్ చేసేదేమి లేక పంత్ కి మసాజ్ చేస్తున్నాడు లక్నో ఓనర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. లక్నో తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదురగొట్టింది. ఏకపక్షంగా సాగిన పోరులో 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. మిచెల్ మార్ష్, మార్ క్రమ్, పూరన్ మెరవడంతో తొలుత లక్నో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఇషాన్ మలింగ(2/28) బౌలింగ్ చేశాడు. అభిషేక్ శర్మ, క్లాసెన్ చెలరేగడంతో లక్ష్యాన్ని సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో ఛేదించింది. ఇన్నింగ్స్ కి బలమైన పునాది వేసి జట్టును లక్స్యం దిశగా నడిపించిన ఘనత అభిషేక్ శర్మదే. మరోవైపు ఇషాన్ కిషన్.. అభిషేక్ దంచడంతో హైదరాబాద్ అలవొకగా విజయం సాధించింది. రవి బిష్ణోయ్ బౌలింగ్ వరుసగా నాలుగు సిక్స్ లు కొట్టి అదరహో అనిపించాడు. 18 బంతుల్లోనే హాప్ సెంచరీ చేశాడు అభిషేక్. మరోవైపు క్లాసెన్, మెండిస్ జంట నాలుగో వికెట్ కి 36 బంతుల్లో 55 పరుగులు జోడించింది.
రాణించిన మార్ష్, మార్ క్రమ్..
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్ క్రమ్ మెరుపు అర్థశతకాలతో రాణించారు. లక్నో జట్టు టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కి దిగింది. మార్స్, మార్ క్రమ్ అదిరే ఆరంభాన్ని ఇచ్చింది. వాళ్ల విధ్వంసక బ్యాటింగ్ తో పవర్ ప్లే ముగిసే సరికే ఆ జట్టు 69/0 తో నిలిచింది. మార్ష్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పరుగుల ప్రవాహాన్ని ఆపలేక, వికెట్లు తీయలేక దిక్కు తోచని స్థితిలో పడ్డ సన్ రైజర్స్ కి హర్ష్ దూబె ఊరటనిచ్చారు. 11వ ఓవర్ లో మార్ష్ ని ఔట్ చేయడంతో స్కోరు, రన్ రేట్ కాస్త తగ్గింది. చివర్లో పూరన్ బ్యాట్ ఝులిపించాడు. చివరి నాలుగు ఓవర్లలో 45 పరుగులు ఇచ్చినా.. ప్రత్యర్థిని కట్టడి చేశామని హైదరాబాద్ భావించింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠి.. వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 20, 2025